సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేసిన చంద్ర‌బాబు

babu

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎప్పుడూ త‌న‌ను తాను ఓ సీఈవోగానే భావిస్తుంటారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో సీఎంగా ఉన్న‌స‌మ‌యంలో కూడా సీఈవోగా పిలిపించుకునేందుకే ఆయ‌న ఆస‌క్తి చూపేవారు. ఆయ‌న చేస్తున్న ప‌ని విధానంతో అంద‌రూ ఆయ‌న్ను ఒక కంపెనీ సీఈవోలానే చూసేవారు. ఇప్పుడా హోదా వ‌దిలేసి చీఫ్ క‌మాండ‌ర్ అవ‌తారం ఎత్తారు. విజ‌య‌వాడ‌లో కృష్ణాన‌ది తీరాన ఒక క‌మాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ఏ భారీ కార్య‌క్ర‌మం జ‌రిగినా… ఏ ఉప‌ద్ర‌వం వ‌చ్చినా… అలాగే, అన్నీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచే ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇందుకోసం అక్క‌డ అత్యుత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఙానంతో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏ మూల‌నున్న ప్రాంతంతో అయినా ఇక్క‌డ నుంచి అనుసంధానం కావ‌చ్చు. దాన్ని ఇప్పుడు క‌మాండ్ అండ్ క‌మ్యూనికేష‌న్ రూమ్‌గా మారుస్తున్న‌ట్లు చంద్ర‌బాబు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ క‌మాండ్ సెంట‌ర్ సీఎంవో ఆధీనంలో ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. దానికి తానే చీఫ్ క‌మాండ‌ర్ అని ప్ర‌క‌టించుకున్నారు. మొత్తానికి సీఈవో నుంచి చీఫ్ క‌మాండ‌ర్‌గా సీఎం మారార‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*