జ‌గ‌న్‌పైకి టీడీపీ పేరెంటింగ్ వెప‌న్‌!

jagan-and-tdp

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ మైండ్ గేమ్‌కు తెర‌తీసింది. హోదా విష‌యంలో కేంద్రం మొండి చెయ్యితో ప్యాకేజీ తీసుకుని ప్ర‌జ‌ల్లోకి పోతున్న చంద్ర‌బాబు… ఇదే విష‌య‌మై ప్ర‌తిప‌క్షాలు ఇంకా పోరాడుతుండ‌డం ఏపీ సీఎంకు రుచించ‌డం లేదు. యువ‌భేరీలు నిర్వ‌హిస్తూ హోదా ఇవ్వ‌న‌న్న కేంద్రానికి చంద్ర‌బాబు లొంగిపోయారంటూ చేస్తున్న ప్ర‌చారంపై చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు స‌రికొత్త మైండ్‌గేమ్‌కు తెర‌తీశారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌పెట్టి… జ‌గ‌న్ స‌భ‌ల‌కు పిల్ల‌ల‌ను పంపొద్దంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

త‌ల్లిదండ్రులు ప్ర‌తిప‌క్ష నేత‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, చ‌దువుకునే పిల్ల‌ల‌కు ఆర్థిక నేరాలు ఏలా చేయాలో నేర్పుతున్నార‌ని ఆయ‌న స‌భ‌ల‌కు పిల్ల‌ల్ని పంపొద్ద‌ని ఈ విష‌యంలో త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. ఇక ఆయ‌న మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మ‌రో ముందుకేసి…విద్యార్థుల బుర్ర‌ల‌ను చెడ‌గొట్టేందుకే జ‌గ‌న్ స‌ద‌స్సులు పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. హోదా గురించి అస‌త్యాలు చెబుతూ… యువ‌త‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. త్వ‌రగా సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న కోరిక ఎప్ప‌టికీ నెర‌వేర‌ద‌ని పేర్కొన్నారు. టీడీపీ ప్ర‌యోగిస్తున్న పేరెంటింగ్ వెప‌న్ ఎంత‌వ‌ర‌కూ విజ‌య‌వంతం అవుతుందో!

Loading...

Leave a Reply

*