నోట్ల ర‌ద్దుపై మోదీకి అదిరిపోయే స‌ల‌హా.. అది మ‌న బాబుగారిదే…!

untitled-5

మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌మ ఒత్తిడి ఫ‌లిత‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర టీడీపీ నేత‌లు బ‌లంగా వాదిస్తున్నారు. బ్లాక్ మ‌నీ అదుపు చేసేందుకు తామిచ్చిన స‌ల‌హా బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తుంద‌ని వారంతా ప‌ర‌మానంద‌ప‌డిపోతున్నారు. చంద్ర‌బాబు లేఖ‌లు రాయ‌డంతోనే మోడీ ఇలాంటి ఆలోచ‌న చేశార‌ని కూడా టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే, రాను రాను మోడీ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ‌డంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా సైలెంట్ అవుతున్నారు.

తామే ఇదంతా చేశామ‌ని చెప్ప‌డం మానేసి జ‌నానికి ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడా త‌న పార్టీ నేత‌ల‌కు మౌఖిక ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిసింది. బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద ఉన్న జ‌నానికి అవ‌స‌ర‌మైన స‌హాయం చేయాల‌ని, అండ‌గా నిలవాల‌ని త‌న ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు సూచించారు. ఇక‌, ప‌నిలో ప‌నిగా ప్ర‌ధాని మోడీకి కూడా అదిరిపోయే స‌ల‌హా ఒక‌టి ఇచ్చారు. ఇప్పుడున్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు త‌క్ష‌ణం రూ.200 నోటు తేవాల‌న్న‌దే ఆ త‌రుణోపాయం.

రెండు వేల నోటు తేవ‌డం వ‌ల్ల చిల్లర స‌మస్య ఎక్కువైంద‌ని, ఆ నోట్లు జ‌నంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ చిల్ల‌ర దొర‌క్క అవ‌స‌రాలు తీర‌డం లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌ట్టెక్కించ‌డానికి త‌క్కువ డినామినేష‌న్ ఉన్న రెండొంద‌ల నోటును అందుబాటులోకి తేవ‌డం త‌క్ష‌ణ ప‌రిష్కార‌మ‌ని చెబుతున్న చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని మోడీకి కూడా తెలిపారు.

Loading...

Leave a Reply

*