ముద్ర‌గ‌డ‌పై బాబు మూడో క‌న్ను!

babu-and-mudragada

కాపు ఉద్య‌మంతో బాబుకు నిద్ర లేకుండా చేస్తున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు మూడో నేత్రాన్ని తెరిచారా? ఈ ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌ధానంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని కాపు సామాజిక వ‌ర్గంలో మెజార్టీ టీడీపీవైపు మొగ్గ‌డంతో రాష్ట్రంలో అధికారం చేప‌ట్టాన‌ని చంద్ర‌బాబు బ‌లంగానే విశ్వ‌సిస్తున్నారు. అలా త‌న వెంట ఉన్న కాపు వ‌ర్గాన్ని వ‌దులుకునేందుకు సీఎం సిద్ధంగా లేరు. అందుకే ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో చెప్పిన‌ట్లు వారికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు క‌మిష‌న్‌ను నియ‌మించారు. ఇంకా ఆ సామాజిక వ‌ర్గ విద్యార్థ‌లు కోసం, నిరుద్యోగుల కోసం ప‌లు ప‌థ‌కాల‌ను ప్రారంభించి అమ‌లు చేస్తున్నారు.

అలాగే, రాష్ట్ర మంత్రివ‌ర్గంలోనూ వారికి అందరికంటే ఎక్కువే ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నారు. ఇదే స‌మయంలో చంద్ర‌బాబుకు కాపు సామాజిక వ‌ర్గాన్ని దూరం చేసేందుకు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేప‌ట్టిన కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప‌లికి వెన‌కుండి న‌డిపిస్తున్నారు. ముద్ర‌గ‌డ వెనుక జ‌గ‌న్ ఉన్నార‌న్న‌ది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. త‌న సామాజిక వ‌ర్గం కోసం పోరాడుతున్న ముద్ర‌గ‌డ… తాను చేస్తున్న డిమాండ్లు సాధించుకోవాలంటే ప్ర‌భుత్వంతో త‌గ‌వులు పెట్టుకోవ‌ద్దు.

బెదిరించో భ‌య‌పెట్టో ప‌నులు చేయించుకోవాలి.కానీ ముద్ర‌గ‌డ మాత్రం నేరుగా చంద్ర‌బాబుతోనే క‌య్యం పెట్టుకుంటున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే టీడీపీ ఆరోప‌ణ‌లు నిజ‌మే అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే ముద్ర‌గ‌డ‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని భావించిన చంద్ర‌బాబు కూడా ఆయ‌నపై నిఘా నేత్రాన్ని తెరిచార‌ని స‌మాచారం. ఆయ‌న ఎవ‌రితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఆయ‌న వెనుక ఎవ‌రెవ‌రున్నారు. రోజూ ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్నారు. ఇలా ముద్ర‌గ‌డ‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే ప‌నిలో గూఢ‌చార వ‌ర్గాలు నిమ‌గ్న‌మైన‌ట్లు స‌మాచారం.

Loading...

Leave a Reply

*