వెలిగిపోతున్న చంద్ర‌బాబు

chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణ‌యించిన ముహుర్తం ప్ర‌కారం బుధ‌వారం ఆయ‌న స‌చివాల‌యంలోని సీఎం చాంబ‌ర్‌లో ఆశీనుల‌య్యారు. వాస్త‌వానికి ద‌స‌రా నాడే స‌చివాల‌యంలోకి వెళ్ల‌ల‌ని బాబు భావించినా… మంగ‌ళ‌వారం సెంటిమెంట్‌తో దాన్ని బుధ‌వారానికి మార్చారు. బుధ‌వారం ఉద‌యం వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య చంద్ర‌బాబు సీఎం చాంబ‌ర్‌లోని చైర్‌లో ఆశీనుల‌య్యారు. హైద‌ర‌బాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న‌ప్ప‌టికీ ఏపీ నుంచి పాల‌న సాగిస్తేనే ప్ర‌జ‌ల‌కు చేరువ‌కావ‌చ్చ‌ని భావించిన చంద్ర‌బాబు విజ‌య‌వాడ నుంచి పాల‌న చేయ‌డం ప్రారంభించారు. అవస‌ర‌మైన ఏర్పాట్లు లేకున్నా ఉన్న‌వాటితోనే స‌ర్దుకుపోతూ కృష్ణా న‌ది ఒడ్డున ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాల‌యం నుంచి సీఎం అని కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. హైద‌ర‌బాద్‌లోని స‌చివాల‌యాన్ని పూర్తి స్థాయిలో నూత‌న రాజ‌ధానికి త‌ర‌లించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌య భ‌వానాల‌ను నిర్మించారు. అవి దాదాపుగా సిద్ధం కావ‌డంతో ఉద్యోగులు కూడా ఈ నెల మొద‌టి వారంలోనే అక్క‌డికి మారిపోయారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి కూడా వెల‌గ‌పూడి స‌చివాల‌యం చేర‌డంతో ఇక పాల‌న అంతా ఏపీ కేంద్రంగానే సాగ‌నుంది.

Loading...

Leave a Reply

*