చంద్ర‌బాబుకు త‌ప్పిన ముప్పు!

babu

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. అనుకోకుండా జ‌రిగిన ఒక సంఘ‌ట‌న అంద‌రినీ కొద్దిసేపు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఢిల్లీ వ‌చ్చిన చంద్ర‌బాబు అక్క‌డ జ‌రుగుతున్న ఇండో చైనా ఎగ్జిబీష‌న్‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డి స్టాల్స్‌ను చూస్తూ క‌లియ‌తిరుగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి పెద్ద శ‌బ్దం వినిపించింది. అది పేలుడు వంటి శ‌బ్ధం కావ‌డంతో భ‌ద్ర‌తా సిబ్బంది అల‌ర్ట‌య్యారు. ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.

చంద్ర‌బాబు చుట్టూ ఉండే భ‌ద్ర‌తా సిబ్బంది ఆయ‌న‌ను సుర‌క్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. కొద్దిసేపు గ‌డిచిన త‌ర్వాత అది ఏసీ గ్యాస్ సిలిండ‌ర్ పేలుడుగా గుర్తించారు. దానివ‌ల్ల పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని తేల్చారు. దాంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. య‌థాలాపంగా బాబు స్టాల్స్‌ను సంద‌ర్శిస్తున్న స‌మయంలో ఈ పేలుడు జ‌ర‌గ‌డంతో అక్క‌డి వారంతా కొంత‌సేపు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన‌ట్లు తెలిసింది.

Loading...

Leave a Reply

*