మోదీ నిర్ణ‌యంలో చంద్ర‌బాబుదే కీ రోల్‌…!

chandra-babu

గ‌త కొంత‌కాలంగా చంద్ర‌బాబు ఒక డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తున్నారు. మీరూ అది వినే ఉంటారు. ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు. గ‌త కొద్ది నెల‌ల కాలంలోనే చంద్ర‌బాబు కొన్ని ప‌దుల సార్లు ఈ డిమాండ్‌ని వినిపించారు. అదేంటంటే.. మార్కెట్‌లో రూ.1000, రూ. 500 నోట్ల‌ను ర‌ద్దు చెయ్యాల‌ని. దేశంలో అవినీతిని నిర్మూలించాలంటే ఇది మంచి ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. వీటిని నిషేధించాల‌ని ఆయ‌న ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. త‌న సూచ‌నగా చెప్పారు. త‌న అభ్య‌ర్ధ‌న‌గా తెలియజేశారు.

ఇన్నాళ్ల‌కి చంద్ర‌బాబు పోరాటం ఫ‌లించింది. అత్య‌ధిక డినామినేష‌న్ క‌ల రూ.1000, రూ.500 నోట్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించ‌గానే చంద్ర‌బాబు ఫుల్ ఖుషీ అయ్యార‌ట‌. తాను ఇన్నాళ్ల‌నుంచి చేస్తున్న ప్ర‌య‌త్నం ఓ ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు గుర్తు చేశార‌ట‌. ఈ చ‌ర్య‌తో అవినీతి చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. ఏమ‌యినా, ఎమ్ఏలో ఆర్ధికశాస్త్రం చ‌దువుకున్న ఆయ‌న‌కు ఈ పాఠాలు వేరెవ‌రెన్నా చెప్పాలా..?

Loading...

Leave a Reply

*