స‌భ‌కు పిల్ల‌ల్నీ తేలేరా? చ‌ంద్ర‌బాబు చిందులు!

chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేసింది. అది బ‌హిరంగ స‌భా వేదిక అని కూడా చూడకుండా త‌న కోపాన్ని వెళ్ల‌గ‌క్కారు. ఓ ఎమ్మెల్యేని చెడామ‌డ తిట్టిప‌డేశారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దోమ‌ల‌పై దండ‌యాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి ఏలూరు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ర్యాలీ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. అక్క‌డే చంద్ర‌బాబుకు మండుకొచ్చింది. వేదికెక్కిన బాబు ఒక‌సారి ఆ ప్రాంగ‌ణ‌మంతా చూశారు. అంతే ఆయ‌న ముఖ‌క‌వ‌ళిక‌లు ఒక్క‌సారిగా మారిపోయాయి. అంతే ఆ స‌భ ఏర్పాట్లు చూస్తున్న ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై విరుచుకుప‌డ్డారు.

స‌భ‌కు విద్యార్థుల‌ను ఎందుకు పెద్ద సంఖ్య‌లో తేలేక‌పోయార‌ని నిల‌దీశారు. లేదు.. సార్ పోలీసుల ఆంక్ష‌ల‌తో లోప‌లికి ఎక్కువ‌మంది రాలేక‌పోయార‌ని చింత‌మ‌నేని వివ‌ర‌ణ ఇవ్వ‌బోయారు. దానికి అడ్డుత‌గిలిన చంద్ర‌బాబు పాఠ‌శాల‌ల‌కు సెలవుఇచ్చింది ఇంటికి పోవ‌డానికి కాదు. కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి అంటూ ఎమ్మెల్యేని చెడ‌మ‌డా తిట్టేశారు. దాంతో బిక్క‌మొక‌మేసిన చింత‌మ‌నేన‌ని సారీ సార్‌.. ఇక‌ముందు ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటూ అని క్ష‌మాప‌ణ చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు పోలీసుల‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌.

Loading...

Leave a Reply

*