పెద్ద నోట్ల ర‌ద్దుపై బాబుకు కోపం వచ్చింది..!

untitled-1-copy

పెద్ద నోట్ల ర‌ద్దు అయిన వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మోదీ నిర్ణ‌యాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌నను స‌మర్ధించారు. దేశ ఆర్ధిక‌వ్య‌వ‌స్థ‌కు ఇది బాగా దోహదం చేస్తుంద‌ని అన్నారు. గత కొన్నేళ్లుగా చంద్ర‌బాబు పెద్ద నోట్ల ర‌ద్దును డిమాండ్ చేస్తున్నారు. వాటితో దేశంలో అవినీతి త‌గ్గుతుంద‌న్నారు. ఆ త‌ర‌వాత నుంచి ఏపీలో పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌యినా ఆయ‌న అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చారు. దేవాల‌యాల్లోని చిల్ల‌రను చెలామ‌ణీలోకి తెచ్చే ఏర్పాట్లు చేశారు.

ఇలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న చంద్ర‌బాబు ఏకంగా దీనిపై ఓ స‌ర్వే కూడా చేయించార‌నే టాక్ వినిపించింది. సామాన్యుల‌లో చాలామంది మోదీ నిర్ణ‌యానికి సానుకూలంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఇవాళ చంద్ర‌బాబు పెద్ద నోట్ల నిర్ణ‌యంపై విరుచుకుప‌డ్డారు. త‌న జీవితంలో ఇలాంటి నిర్ణ‌యాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌న్నారు. ఒక్క స‌మ‌స్య కోసం 12 రోజుల పాటు దేశం మొత్తం నిరీక్షించేలా చేసింద‌ని, అయినా రోజురోజుకు స‌మ‌స్య‌లు పెర‌గ‌డ‌మే కానీ, త‌గ్గడం లేద‌న్నారు చంద్ర‌బాబు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో అన్ని వ‌ర్గాల వారు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి 2000వేల కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయ‌ని, అందులో 400 కోట్లేన‌ని తెలిపారు. ప్ర‌భుత్వ కార్యక‌లాపాల‌న్నీ ఆన్‌లైన్‌లోనే జ‌రిగేలా చూడాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. జ‌న్‌ధ‌న్ ఖాతాలు, రూపే కార్డుల‌ను వెంట‌నే యాక్టివ్ చెయ్యాల‌ని తెలిపారు. మొత్త‌మ్మీద‌, జ‌నాల‌లో నోట్ల ర‌ద్దుపై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డంతో చంద్ర‌బాబు రూట్ మార్చిన‌ట్లున్నారు.

Loading...

Leave a Reply

*