లోకేశ్‌కు చంద్ర‌బాబు క్లాసు!

lokesh

త‌న రాజ‌కీయ వారసుడు లోకేశ్‌కు ఏపీ సీఎం క్లాసు పీకారా? అవున‌నే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ లోకేశ్‌కు అప్ప‌గించేశారు చంద్ర‌బాబు. అప్ప‌టి నుంచి పార్టీ స‌భ్య‌త్వం మొద‌లు… ఇత‌ర పార్టీల నేత‌లు టీడీపీలో చేరిక వ‌ర‌కూ అన్నీ లోకేశ్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లోకేశ్‌పై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో మాదిరి పార్టీ నేత‌ల్లో స్పీడ్ లేద‌ని, పెట్టుకున్న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా వేగంగా ప‌ని చేయాలేక‌పోతున్నార‌ని చంద్ర‌బాబు కొద్దిగా అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. ఇటీవ‌ల కేబినెట్ భేటీకి ముందు జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల క‌థ‌నం.

చంద్ర‌బాబే అన్ని చూసుకుంటార‌న్న భావ‌న కొంద‌రిలో ఉంద‌ని అది మార్చుకోవాల‌ని ఆయ‌న చెప్పార‌ట‌. ఇక‌, గ‌తంలో ఏదైనా ప‌ని చెబితే వెంట‌నే దాన్ని పూర్తి చేసే లోకేశ్ కూడా ఇప్పుడు నెమ్మ‌దిస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌ని అని సున్నితంగానే త‌న వార‌సునికి బాబు క్లాస్ పీకార‌ట‌. రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాల్లో అనుకున్న‌దానికంటే వేగంగా ప‌ని చేయ‌కుంటే న‌ష్ట‌పోతామ‌ని తేల్చేశార‌ట‌. ప్ర‌జ‌ల్లో 80 శాతం మందిని మ‌న‌వైపు ఆక‌ట్టుకోవాలి. ఆ విష‌యంలో ఎవ‌రు నిర్ల‌క్ష్యం వ‌హించినా అది త‌న కుమారుడైనా ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశార‌ట చంద్ర‌బాబు.

Loading...

Leave a Reply

*