జ‌గ‌న్ బాబు ఎందుకు రెచ్చిపోతున్నారు?

jagan-and-babu

ఏపీలో విప‌క్ష నేత జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు రెచ్చిపోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ పెద్ద‌గా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉన్న చంద్ర‌బాబు ఆ వైఖ‌రిని వ‌దిలేశారు. రెండు రోజులుగా వ‌ర‌ద‌, వ‌ర్ష‌ప్ర‌భావ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్న‌ర ఏపీ సీఎం నేరుగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. జ‌గ‌న్ యువ‌భేరీ స‌భ‌ల‌కు పిల్ల‌ల్ని పంపొద్దంటూ నేరుగా త‌ల్లిదండ్రుల‌కే విజ్ఞ‌ప్తి చేశారు చంద్ర‌బాబు. జ‌గ‌న్ వెంట పిల్ల‌ల్ని పంపితే అత‌డిలానే అంద‌రూ త‌యార‌వుతార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఆదివారం గుంటూరులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు మ‌రింత‌గా చెల‌రేగిపోయారు. ఉన్మాదిగా మారిన జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అలాంటి ఉన్మాదుల పార్టీలో ఉండొద్దంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌లు… ఓటుకు నోటు కేసులో బ‌య‌ట‌ప‌డేందుకు చంద్ర‌బాబు కేంద్రానికి రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టార‌ని అందుకే హోదా వ‌దిలేసి ప్యాకేజీకి సై అంటున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌కుంటే…. హోదాను సెంటిమెంట్‌గా భావిస్తున్న ప్ర‌జ‌లు త‌న‌కు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్న‌ట్లే ఉంది. అందుకే త‌న స‌హ‌జ స‌హ‌న‌శీల వైఖ‌రిని విడ‌నాడి జగ‌న్‌పై నిప్పులు క‌క్కుతున్న‌ట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*