నోట్ల ర‌ద్దుపై బాబుని భ‌య‌పెట్టిన పార్టీ ఎమ్మెల్సీ.. భ‌య‌ప‌డ్డ బాబు ఏం చేశాడంటే…?

untitled-3-copy
నోట్ల ర‌ద్దుపై చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్న‌ది నిజ‌మే. ప‌ద‌కొండు రోజులైనా చ‌ల్లార‌ని ఈ క‌రెన్సీ సంక్షోభాన్ని చూసి క‌ల‌వ‌ర‌ప‌డుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఈ విష‌యాన్ని టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా వెల్ల‌డించారు. తొలి నుంచి మోడీని స‌మ‌ర్థిస్తున్న చంద్ర‌బాబు ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తేట‌తెల్ల‌మ‌వుతోంది. ఆదివారం ఒక మీడియా అధినేత నిర్వ‌హించిన చ‌ర్చ‌లో టీడీపీ నేత సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… మోడీ నిర్ణ‌యంతో సాధార‌ణ జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవ‌డో ఒక‌డు త‌ప్పు చేస్తే… దానికి జ‌నం అంద‌రినీ శిక్షిస్తున్నార‌ని సోమిరెడ్డి చెప్పారు.
పేద‌లు పైసా పైసా కూడ‌బెట్టుకున్న సొమ్మును ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని సోమిరెడ్డి తెలిపారు. న‌ల్ల‌ధ‌నం దాచుకున్న వ్య‌క్తుల‌పై చ‌ర్య పేరుతో సామాన్యుడిని ఇబ్బందుల పాలు చేశార‌ని, ఇది వాంఛ‌నీయం కాద‌ని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. నోట్ల ర‌ద్దు మా ఘ‌న‌తే అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల వైఖ‌రి ఇప్పుడు మారింద‌ని సోమిరెడ్డి మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మవుతోంది. తామేదో ఊహించి నోట్ల ర‌ద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తే… చివ‌ర‌కు అది భ‌స్మాసుర హ‌స్తం మాదిరి త‌యార‌వ‌డంతో టీడీపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ని సోమిరెడ్డి మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.
అంతే, సోమిరెడ్డి మాట‌ల‌కు ముందు నోట్ల ర‌ద్దు వ్యవ‌హారం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌నుకున్న చంద్రబాబు.. ఆ త‌ర్వాత వెంట‌నే స్వ‌రం మార్చారు. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను గుర్తు చేశారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఇంత‌టి ప్ర‌హ‌స‌నాన్ని చూడ‌లేద‌ని వ్యాక్యానించారు. 12 రోజుల తర్వాత కూడా నోట్లు ప్ర‌జ‌ల చేతుల్లోకి రాలేదంటే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోవాల‌న్నారు. తొలిసారిగా నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం విశేషం.
Loading...

Leave a Reply

*