కృష్ణాలో టీడీపీ సోలో ఫెర్ఫార్మెన్స్‌!

untitled-16

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత విజ‌య‌వాడ‌ను రాజ‌ధానిగా ప్రక‌టించ‌డంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. విప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా… చంద్రబాబు మాత్రం విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాల్లోనే రాజ‌ధాని ఉంటుంద‌ని ప్రక‌టించారు. ఆ త‌ర్వాత కృష్ణా జిల్లాలో రాజ‌కీయంగా త‌మ‌కున్న ప‌ట్టును మ‌రింత నిలుపుకునేందుకు చ‌ర్యలు చేప‌ట్టారు. ఇంకా క‌రెక్టుగా చెప్పాలంటే రాజ‌ధాని జిల్లాలో మరో పార్టీ ఉనికి లేకుండా… ఉన్నా నామ‌మాత్రంగా ఉండేలా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. సామాజిక ప‌రంగా ఇక్కడ త‌మ‌కున్న ఎడ్వాంటేజ్‌ను ఆస‌రాగా చేసుకుని కొద్దిగా బ‌లంగా ఉన్న పార్టీల‌ను నామ‌మాత్రం చేసేప‌నిలో చంద్రబాబు ఉన్నారు.

కాంగ్రెస్‌లో కీల‌కంగా ఉంటూ ఈ ప్రాంతంలో ఆ పార్టీని భుజాన వేసుకుని న‌డుపుతున్న దేవినేని నెహ్రూపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఆయ‌న‌ను పార్టీలోకి లాగేశారు. నెహ్రూ వ‌చ్చి చంద్రబాబును క‌లిసే వ‌ర‌కూ ఆయ‌న టీడీపీలోకి రాబోతున్నట్లు మూడోకంటికి తెలియ‌కుండా ప‌ని కానిచ్చారు దేశం నేత‌లు. ఇక‌, ఇప్పుడు వైసీపీకి చెందిన వేదవ్యాస్‌ను పార్టీలోకి తీసుకోబోతున్నారు. అంటే ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల కంచుకోట‌గా ఉన్న బెజ‌వాడపై ఇక టీడీపీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం కానుంది. కృష్ణా జిల్లాలో మ‌రో పార్టీని లేకుండా చేసేందుకే చంద్రబాబు అండ్‌కో వ్యూహాత్మకంగా రాజ‌కీయ వ‌ల‌స‌ను ప్రోత్సహిస్తూ… తాను బ‌లోపేతం అవుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*