కూతురి పెళ్లిలో కొత్త ట్విస్ట్‌.. గాలికి ఊహించని షాక్ ఇచ్చిన బీజేపీ..!

untitled-8

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి బీజేపీ చీఫ్ అమిత్ షా ఊహించ‌ని షాక్ ఇచ్చారు. రేపు ఆయ‌న కూతురి వివాహం. అంగ‌రంగ వైభ‌వంగా ఈ మ్యారేజ్‌ని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చెయ్యాల‌ని నిశ్చయించుకున్నారు. దీనికోసం ఆయ‌న ఎన్నో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఎంద‌రో సెల‌బ్రిటీలకు గాలి స్వ‌యంగా ఆహ్వానాలు పంపించారు. గిఫ్ట్‌లిచ్చి మ‌రీ వివాహానికి ఆహ్వానించారు. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల‌యిన చిరంజీవి, ప‌వ‌న్‌తోపాటు దాస‌రి, ప్ర‌భాస్ వంటి ప‌లువురుకి ఇన్‌విటేష‌న్‌లు అందించారు. ఇటు, ప‌లువురు హీరోయిన్‌ల‌ను కూడా పిలిచారు.

కూతురి మ్యారేజ్‌కి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానించారు. ఆయ‌న జైలు శిక్ష అనుభవించినా.. గ‌తంలో ఆయ‌న క‌ర్నాట‌క బీజేపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. పార్టీని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం గాలికి అడ్డంకిలా మారేలా క‌నిపిస్తోంది. పెళ్లికి వెళ్లాలా వ‌ద్దా అని క‌ర్నాట‌క‌తోపాటు ఏపీ బీజేపీ నేత‌లు కూడా బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాని సంప్ర‌దించారు. దానికి స్పందించిన ఆయ‌న.. పెళ్లికి వెళ్లొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కొంత‌మంది కీల‌క బీజేపీ నేత‌ల‌కు స్వ‌యంగా అమిత్‌షానే ఫోన్ చేసి వెళ్లొద్ద‌ని చెప్పార‌ని క‌ర్నాట‌క క‌మ‌ల‌నాధులు చెప్పుకుంటున్నారు.

వంద‌ల కోట్ల రూపాయ‌ల బ్లాక్ మ‌నీ వెచ్చించి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న గారాల ప‌ట్టి వివాహం చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో, బ్లాక్‌మ‌నీకి వ్య‌తిరేకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సమ‌ర‌శంఖం పూరించారు. ఈ పెళ్లికి హాజ‌ర‌యితే ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు పంపిన‌ట్లు అవుతుంద‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే, త‌మ నేత‌ల‌కు ఇలాంటి సూచ‌న‌లు చేసింద‌ట హైక‌మాండ్‌. మ‌రి, గాలి కూతురికి ఇది పెద్ద దెబ్బ అవుతుందా..?

Loading...

Leave a Reply

*