మోడీ… ఆ త‌ర్వాత చంద్ర‌బాబే… దేశంలో బెస్ట్ సీఎం

chandra-babu

ఇటీవ‌ల దేశంలో నెంబ‌ర్ వ‌న్ సీఎంగా కేసీఆర్‌కు గుర్తింపు ల‌భించిందంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆ ర్యాంకుల విశ్వ‌స‌నీయ‌త ఏమిటో తెల‌య‌దు కానీ… దేశంలో ప్ర‌ధాని మంత్రి మోదీ త‌ర్వాత అంత‌టి గౌర‌వ మ‌ర్యాద‌లు పొందుతున్న వ్య‌క్తి మాత్రం ఏపీ సీఎం చంద్ర‌బాబే. ఇందులో ఏ సందేహం లేదు. తొటి తెలుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ స‌హా దేశంలో ఏ ముఖ్య‌మంత్రి అయినా చంద్ర‌బాబు త‌ర్వాతే. ఇది చెప్ప‌డానికి ఎవ‌రికీ సందేహం అక్క‌ర్లేదు. ప్ర‌పంచ స్థాయి వేదిక‌లు ఏ స‌మావేశాలు నిర్వ‌హించిన చంద్ర‌బాబుకు వ‌స్తున్న ఆహ్వానాలే దీనికి ప్ర‌బ‌ల నిద‌ర్శ‌నం. ఇత‌ర‌ర దేశాల‌తో దౌత్య సంబంధాలు నెర‌ప‌డంలో ప్ర‌ధానీ విరివిగా విదేశీ యాత్రలు చేస్తుంటారు. అది స‌హ‌జం. ఆయ‌న త‌ర్వాత విదేశాల‌లో ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్న‌… ప‌లు ప్ర‌పంచ స్థాయి సంస్థ‌ల ఆహ్వానాలు అందుకుంటున్న వారిలో చంద్ర‌బాబే అగ్ర‌గ‌ణ్యుడు. తాజాగా ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో పాల్గొనాలంటూ చంద్ర‌బాబును ఆహ్వానించింది.

చంద్ర‌బాబు ఇలా ఈ వేదిక ఆహ్వానం అందుకోవ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. దేశంలో ఏ ముఖ్య‌మంత్రికి ఇలాంటి గౌర‌వం ద‌క్క‌లేదు. అలాగే, ఏపీకి పెట్టుబ‌డుల సేక‌ర‌ణ కోసం ర‌ష్యా, చైనా, సింగ‌పూర్ అమెరికా త‌దిత‌ర దేశాలు చుడుతున్న ముఖ్య‌మంత్రి… అక్క‌డి ప్ర‌భుత్వాలు, ఇత‌ర వాణిజ్య వ‌ర్గాల నుంచి సాద‌ర ఆహ్వానాన్ని పొందుతున్న వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని చెప్ప‌డం అతిశ‌యోక్తే కాదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 17 నుంచి 20వ‌ర‌కూ దావో్‌స్‌లో జ‌రిగే ఆర్థిక వేదిక స‌ద‌స్సుకు చంద్ర‌బాబు హాజ‌రు కానున్నారు. ఈ స‌ద‌స్సుకు మ‌న దేశం నుంచి హాజ‌ర‌వుతున్న ఏకైక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే కావ‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది, ఈ ఏడాది జనవరి నెలల్లో జరిగిన సదస్సులకు ముఖ్యమంత్రి ఏపీ నుంచి అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్లారు.

గత ఏడాది జరిగిన సదస్సుకు డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు క్లాజ్‌ ష్వాబ్‌ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి.. ఆయన కోసం రిసెప్షన్‌ కూడా ఇచ్చారు. ‘‘పట్టణాభివృద్ధి భవితవ్యం’’ అనే శీర్షిక కింద, నవ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యాలు, తన విజన్‌ గురించి వివిధ దేశాల అధినేతలు, పలు సంస్థల సీఈవోలతో చంద్రబాబు పంచుకొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 46వ వేదిక సదస్సు వేదికగా.. ‘బ్రాండ్‌ ఏపీ’గా రాష్ట్ర ప్రతిష్ఠను చంద్రబాబు విశ్వవ్యాప్తం చేశారు. ఈ సారి కూడా చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌నను ఏపీకి మ‌రిన్ని పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒక అవ‌కాశంగా వినియోగించుకోవాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికార వ‌ర్గాల‌కు ఆదేశాలందాయి.

Loading...

Leave a Reply

*