బాబు ఒకే అంటే ఎర్ర‌బెల్లి, గుత్తాల‌కు ప‌ద‌వులు

chandra-babu

తెలంగాణ‌లో ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు రావాలంటే ఏపీలో సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ కావాల‌ట‌. ఇదేమీ రివ‌ర్స్ తిర‌కాసు అంటారా? అక్క‌డే ఉంది రాజ‌కీయం. ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టి వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన నేత‌ల‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వులు ఇస్తే… తెలంగాణ‌లో కూడా టీడీపీ, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన నేత‌లను కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని కేసీఆర్ యోచిస్తున్నార‌ట‌. టీడీపీ నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన గుత్తా సుఖుంద‌ర్ రెడ్డిల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని కేసీఆర్ భావించినా అందుకు ఏపీతో లింకు పెట్టిన‌ట్లు తాజాగా చ‌ర్చ జ‌రుగుతోంది. కెసిఆర్ త‌న మంత్రివర్గంలో మార్పులు చేయాలని, ఎర్రబెల్లి, గుత్తా లతో పాటు వినయ్ బాస్కర్, కోవా లక్ష్మి లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నార‌న్న‌ది టీఆర్ఎస్ వ‌ర్గాల క‌థ‌నం.

ఈ క్ర‌మంలోనే ఏపీలో కూడా చంద్రబాబు త‌న మంత్రివర్గాన్ని విస్తరించాలని, ఆ విస్తరణలో వైసిపి ఎమ్మల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్,అమరనాద్ రెడ్డిలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్రకారం ఫిరాయింపుదారులకు చంద్ర‌బాబు మంత్రి పదవులు ఇస్తే అప్పుడు తెలంగాణ‌లో కూడా బాబు చూపిన దారిలో న‌డ‌వాల‌ని కేసీఆర్ త‌ల‌పోస్తున్నార‌ట‌. గతంలో టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చినప్పడు చంద్రబాబు తో సహా పలువురు టిడిపి నేతలు తీవ్రంగా విమర్శించారు.రేవంత్ రెడ్డి దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి విమ‌ర్శ‌లు రాకుండా ఉండ‌డం కోస‌మే బాబును ఫాలో అవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*