ప‌వ‌న్‌… జ‌గ‌న్‌ల దెబ్బ‌కు బాబు ఢిల్లీకి ఫోన్‌

chandra-babu

చంద్ర‌బాబు ఢిల్లీకి ఫోన్ చేశారు. కేంద్ర మంత్రులంద‌రితో మాట క‌లిపారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి వెంక‌య్య‌, జ‌లవ‌న‌రుల శాఖ మంత్రి ఉమా భార‌తి ఇలా అంద‌రికీ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రం ఇబ్బందుల‌ను మ‌రోసారి వారికి వివ‌రించారు. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరారు. ఇచ్చే నిధుల‌ను త్వ‌ర‌గా విడుద‌ల చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌తో ఉన్న విబేధాల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించేలా చూడ‌మ‌ని కోరారు. ఇలా చంద్ర‌బాబు వ‌రుస‌గా కేంద్ర మంత్రులంద‌రికీ ఫోన్ క‌ల‌ప‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మిత్ర‌ప‌క్ష‌మో కాదో తెలియ‌ని ప‌వ‌నే కార‌ణ‌మ‌ని ఏపీలో అంద‌రూ అనుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ క‌ర్నూలులో స‌భ పెట్టారు.

డెడ్‌లైన్ పెట్టిమ‌రీ రాజీనామాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించార‌రు. ఇక వ‌చ్చేవారం ప‌వ‌న్ అనంత‌పురంలో స‌భ పెట్ట‌బోతున్నారు. ప్ర‌త్యేక హోదాపై మ‌రోసారి గ‌ళం విప్ప‌బోతున్నారు. దాంతో తాను కేంద్రాన్ని క‌దిలించి ఇస్తాన‌న్న‌వైనా తొంద‌ర‌గా తీసుకురాకుంటే జ‌నంలో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని గ్ర‌హించే చంద్ర‌బాబు కేంద్ర మంత్రులంద‌రికీ వ‌రుస‌బెట్టి ఫోన్‌లు చేశార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దో తేదీన స‌భ అన్నారు కాబ‌ట్టి. ఎటూ 28న జైట్లీ అమ‌రావ‌తికి వ‌స్తున్నారు కాబ‌ట్టి ఆ లోపుగానే ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త తేవ‌డం రాజ‌ధాని నిర్మాణానికి ఎంతోకొంత నిదులు సాధించ‌డం వంటివి చేస్తే ప్ర‌తిప‌క్షాల దాడి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌న్న‌ది ఏపీ సీఎం యోచ‌న‌గా చెబుతున్నారు.

కేంద్రం స్పందించి ఏపీని ఆదుకుని చంద్ర‌బాబును ఒడ్డున ప‌డేస్తుందో లేదో చూడాలి.

Loading...

Leave a Reply

*