వైసీపీది ఉగ్ర‌వాదం… స్పీడు పెంచిన బాబు!

babu

ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీపై చంద్ర‌బాబు దూకుడు పెంచారు. రాష్ట్రాభివృద్ధికి తాము నిరంత‌రం కృషి చేస్తుంటే వైసీపీ మాత్రం అడుగ‌డుగునా అడ్డుప‌డుతోంద‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీపై అస‌హ్యం పెరుగుతోంద‌ని మండిప‌డ్డారు. వైసీపీకి చెందిన బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ టీడీపీలో చేరిన సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష పార్టీవి తీవ్ర‌వాద చ‌ర్య‌లంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు విశ్వ‌స‌నీయ‌త ఉండాల‌ని వైసీపీ మాత్రం ప్రతి అభివృద్ధి కార్యక్రమానికీ అడ్డుపడుతూ.. ప్రజలను ప్ర‌భుత్వంపైకి రెచ్చగొడుతోందని, అప్ప‌ట్లో నక్సలైట్లు, తీవ్రవాదులు ఎక్కడో ఇల్లు తగులపెట్టి వెళ్లేవారు. ఇప్పుడు వైసీపీ అదే రీతిలో వ్యవహరిస్తోందని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాలతో ప్రజలకు మేలు చేయాలి తప్ప వారికి నష్టం చేయకూడదని వైసీపీ నేత‌ల్లో ఇగో కనిపిస్తోందని ఆరోపించారు. పోలవరంపై కోర్టుల‌కెక్కారు. పుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్య‌మిస్తున్నారు. ఎవ‌రైనా అయితే, భ‌య‌ప‌డ‌తారేమో కానీ, తాను భయపడే ర‌కం కాద‌ని, ఎన్ని రకాలుగా అడ్డొచ్చినా మీ ఆటలు సాగనివ్వ‌న‌ని చంద్ర‌బాబు హెచ్చరించారు.

Loading...

Leave a Reply

*