సీల్డ్ క‌వ‌రులో ఏముంది?

chandra-babu

ఇప్పుడు చ‌ర్చంతా క‌వ‌ర్ల‌పైనే. చంద్ర‌బాబు ఇచ్చిన సీల్లు క‌వ‌ర్ల‌పైనే. మంత్రుల ర్యాంకులు లీకు కావ‌డంతో ఎమ్మెల్యేల విష‌యంలో చంద్ర‌బాబు కొత్త పంథా అనుస‌రించారు. సీల్డ్ క‌వ‌ర్ల‌లలో ఎమ్మెల్యేల జాత‌కాల‌ను పంపిణీ చేశారు. పైగా అందులోని విష‌యాల‌ను మీడియాకు చెబితే తీవ్రమైన ప‌ర్య‌వ‌సానాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. దాంతో ఎమ్మెల్యేలంతా క‌వ‌ర్ల‌ను భ‌ద్రంగా ప‌ట్టుకుని ఇళ్ల‌కు వెళ్లిపోయారు. మీడియాతో ఎంతో క్లోజ్‌గా ఉండే నేత‌లు కూడా ఈ ఒక్క విష‌యంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. వెర‌సి చంద్ర‌బాబు సీల్డ్ క‌వ‌ర్ల‌లో ఏం చెప్పారో ర‌హ‌స్యంగానే ఉండిపోయింది. భ‌విష్య‌త్తులోనూ అది బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేదు. అయితే, ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో అంత ర‌హ‌స్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏంటో చంద్ర‌బాబుకే తెలియాలి.

అయినా స‌ద‌రు నేత‌ల‌పై ప్ర‌జాభిప్రాయం వ్య‌తిరేకంగా ఉంటే ఎమ్మెల్యే ఒక్క‌డు ఆ విష‌యం తెలుసుకుని చేసేదేముంది. తామంతా వ్య‌తిరేకంగా ఉన్న విష‌యం స‌ద‌రు ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసు క‌దా. తాము ఎమ్మెల్యే అయిన ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి ప‌నులు చేస్తున్నామో నేత‌ల‌కు ఫుల్ క్లారిటీ ఉంటుంది క‌దా. ఇప్పుడీ స‌ర్వే నివేదిక‌లు చెప్పే కొత్త సంగ‌తి ఏముంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓట్ల పండుగ వ‌చ్చిన నాడు వెయ్య కాకుంటే రెండు వేలు ఇచ్చి ఓటు కొంటామ‌న్న ధైర్యం నేత‌ల‌కు ఉంటుంది. గెలిచిన త‌ర్వాత సంపాదించుకునే అవ‌కాశం ఆ భ‌రోసాను క‌ల్పిస్తుంది. ఇంక ఇప్పుడు ఈ స‌ర్వేలు, నిఘా నివేదిక‌లు కొత్త‌గా చెప్పేదేంటే చంద్ర‌బాబుకే తెలియాలి.

Loading...

Leave a Reply

*