రాజ‌ధానిలో జ‌గ‌న్‌కు బాబు షాక్‌!

untitled-17

ఏపీ రాజ‌ధాని జిల్లా కృష్ణాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి వేద‌వ్యాస్‌ను టీడీపీ లోకి ఆహ్వానించారు. ఆదివారం చంద్రబాబుతో స‌మావేశ‌మైన వేద‌వ్యాస్ ఈ నెల 21న టీడీపీలో చేర‌నున్నట్లు ప్రక‌టించారు. వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలో చేరాల‌ని వేద‌వ్యాస్ అనుకున్నప్పటికీ అది వీలుప‌డ‌లేదు. దాంతో ఆయ‌న పెడన నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కాగిత వెంక‌ట్రావు చేతిలో ఓడిపోయారు. దాంతో అప్పటి నుంచి ఆయ‌న టీడీపీలో చేర‌తార‌ని ప్రచారం జ‌రుగుతున్నా అది ఇప్పటికి సాకారం అవుతోంది.

టీడీపీ ఆక‌ర్ష్‌లో భాగంగా ప‌లువురు ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, టీడీపీ నేత‌లు ఇప్పుడు ప్రతిప‌క్ష పార్టీలోని కీల‌క నేత‌ల‌పైనా దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేత‌లు ఇప్పుడు జోరు పెంచుతున్నట్లు క‌నిపిస్తోంది. త్వర‌లో స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌ర‌గున్న నేప‌థ్యంలో వైసీపీలోని నాయ‌కుల‌ను పెద్ద సంఖ్య లో ఆక‌ర్షించ‌డం ద్వారా ఆ పార్టీని దెబ్బకొట్టవ‌చ్చని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వేద‌వ్యాస్ నుంచి మొద‌లు పెట్టి మ‌రికొంద‌రు కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకొనేందుకు అధికార‌పార్టీ నేత‌లు పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*