చంద్ర‌బాబుకు సొంత ఇంట్లోనే సెగ‌

babu

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు సెగ మొద‌ల‌యిందట‌… అది కూడా ప్ర‌తిప‌క్ష జ‌గ‌న్ పార్టీ నుంచి కాదు… పార్టీలోని గ్రూపుల గోల‌తో అంత కంటే కాదు…. ఏకంగా ఇంటి నుంచే బాబుకు కుంపటి మొద‌లైందిట‌… బాబు మీద ఆయ‌న కుటుంబ‌స‌భ్యులే అలుగుతున్నారుట‌… టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చేసినా ఆ త‌ర్వాత త‌నకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదని లోకేష్‌లో కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోందిట‌… తెలంగాణ‌లో కేసీఆర్ కొడుకు కేటీఆర్ మంత్రిగా చ‌క్రం తిప్పుతున్నాడు… అంతేకాదు కేసీఆర్ వార‌సుడిగా కూడా కేటీఆర్ పేరు తెచ్చుకుంటున్నాడు…. పార్టీలో, ప్ర‌భుత్వంపై త‌నదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతున్నాడు కేటీఆర్‌… అలాంటిది కేటీఆర్‌కి ఏపీలో కౌంట‌ర్ పార్ట్‌ని నేను… నాకు ఎలాంటి అధికారిక ప‌ద‌వి లేదే అంటూ పైకి పెద‌వి విప్ప‌కుండా బాధ‌ప‌డిపోతున్న చిన‌బాబు… ఇంట్లో మాత్రం పెద‌బాబుపై విరుచుకుప‌డు తున్నాట్ట‌…

నాకెప్పుడు ఇస్తారు మంత్రి ప‌ద‌వి అని నిల‌దీస్తున్నాట్ట‌… ఈసారి కూడా ద‌స‌రాకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.. దీంతోత‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే చంద్ర‌బాబు ఇలా చేస్తున్నాడంటూ త‌న‌యుడు రుసరుస‌లాడుతున్నాట్ట‌…. మ‌రోవైపు త‌న భ‌ర్త‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోయేస‌రికి నారా బ్రాహ్మ‌ణి కూడా మామ‌గారిపై కారాలుమిరియాలు నూరుతోందిట‌… ఇలా కొడుకు కోడ‌లు త‌న‌పై విరుచుకుప‌డుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్న బాబుకు బాల‌య్య మ‌రో షాక్ ఇచ్చాట్ట‌… నా అల్లుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. నాకు మంత్రి ప‌దవి ఇవ్వ‌లేదు అంటూ బాల‌య్య మండిప‌డుతున్నాట్ట‌… ఎవ‌రికి ఇవ్వ‌క‌పోతే ఎలాగా అంటూ నిల‌దీస్తున్నాట్ట‌..ఇలా ఇంట్లో పుట్టిన అస‌మ్మ‌తితో బాబుకు సెగ త‌గులుతోంది… లోకేష్‌కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే కొంప కొలంబో అయిపోయేలా ఉంద‌ని బాబు బెంబేలెత్తు తున్నాట్ట‌.

Loading...

Leave a Reply

*