ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డుతున్న బాబు!

chnadra-babu

రాష్ట్ర ప్ర‌జ‌లంతా త‌న‌వైపే ఉన్నార‌ని గ‌ట్టిగా చెబుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు లోలోప‌ల భ‌య‌ప‌డుతున్న‌ట్లే ఉంది. ఆ కార‌ణంతోనే త్వ‌రలో నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా వాయిదా వేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల పార్టీ నేత‌ల స‌మావేశాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రుల‌పై సీఎం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే బావుండ‌ద‌ని హెచ్చరిక‌లు కూడా చేస్తున్నారు. దీనికంత‌టికి కార‌ణం, తాను ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నా… ప్ర‌జ‌ప‌యోగ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా జ‌నంలో పార్టీ ప‌ట్ల సానుకూలత పెర‌గ‌లేద‌న్న విష‌యం ప‌లు స‌ర్వేల‌లో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అందుకే చంద్ర‌బాబు ఇటీవ‌ల పార్టీపైనా, నేత‌ల వైఖ‌రిపైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో జ‌ర‌గాల్సిన నాలుగు కార్పొరేష‌న్‌, ఏడు మునిసిపాలిటీల ఎన్నిక‌ల‌ను కూడా వాయిదా వేసుకోవ‌డం ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తోంది.

2014 సాధారణ ఎన్నికలకు త‌ర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ. ఎమ్మెల్యేల మృతి కారణంగా నందిగామ, తిరుపతి ఉప ఎన్నికలు మినహా ఎక్కడా ఎన్నికలు జరగలేదు. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిపల్‌ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడతాయని అంద‌రూ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికలపై ఆచితూచి అడుగు వేస్తున్నారు. త్వ‌ర‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని మంత్రులు ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ఆ ఎన్నిక‌ల‌లో ప్ర‌భుత్వం సంగ‌తి చూడాల‌ని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే, అనూహ్యంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను మ‌రో ఏడెనిమిది నెల‌లు వెన‌క్కి నెట్టేసేందుకు ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది.

దీన్నంత‌టిని బ‌ట్టి చూస్తే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వ‌చ్చే ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌ల‌కు కొన్ని మీమాంస‌లు ఉన్నాయ‌ని అందుకే ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పేరుతో వాటిని వాయిదా వేసేందుకు య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*