బాబు భ‌య‌ప‌డ్డారు… కేసీఆర్ బేఫిక‌ర్ అన్నారు!

kcr-and-chandra-babu

ఆంధ్రప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారానికి భ‌య‌ప‌డ్డారు. అదే సమ‌యంలోతెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మంగ‌ళ‌వార‌మే మంచిద‌ని ముందుకెళ్లారు. ఏపీ తాత్కాలిక స‌చివాల‌యంలో దాదాపుగా పూర్తి కావ‌డంతో ఉద్యోగులంతా అక్క‌డికి త‌ర‌లి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా రోజున సీఎం కూడా వెల‌గ‌పూడిలో కార్యాల‌య ప్ర‌వేశం చేయాల‌ని బావించారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అయితే, చివ‌రి నిమిషంలో చంద్ర‌బాబుకు ఒక అనుమానం వ‌చ్చింది. ద‌స‌రా రోజు మంగ‌ళ‌వారం కాబ‌ట్టి పండుగ అయిన‌ప్ప‌టికీ ఆ రోజు మంచి ప‌నులు చేయ‌డం అమంగ‌ళ‌క‌ర‌మ‌ని భావించారు. కొత్త‌గా వెల‌గ‌పూడిలోకి వెళ్తూ మంగ‌ళ‌వారం వెళ్ల‌డం ఎందుక‌ని దానిని వాయ‌దా వేసుకుని బుధ‌వారం కార్యాల‌య ప్ర‌వేశం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కంటే దైవ భ‌క్తిలో రెండు పాళ్లు ఎక్కువ చ‌దివిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇదే మంగ‌ళ‌వారం రోజున కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా చేప‌ట్టారు.

అయితే, కేసీఆర్ ఇక్క‌డో లాజిక్ ప్ర‌యోగించారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి ద‌శ‌మి గ‌డియ‌లు ప్ర‌వేశించగానే బ‌ల‌మైన ముహుర్తాన్ని ఎంచుకుని జిల్లాల ఏర్పాటు జీవోల‌ను ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత మంగ‌ళ‌వారం రోజున మంచి టైం చూసుకుని 11-20 నిమిషాల‌కు కొత్త క‌లెక్ట‌రే్ట్ల‌ను ప్రారంభించారు. మంగ‌ళ‌వారం సెంటిమెంట్ ఉన్నా తాము పెట్టిన ముహుర్తం ఆ సెంటిమెంట్‌ను అధిగ‌మించేలా ఉంద‌ని పండితులు కేసీఆర్ను ఒప్పించ‌డంతో ఆయ‌న కొత్త జిల్లాల‌ను ప్రారంభించేశారు. చంద్ర‌బాబుకు ఇలాంటి స‌ల‌హా ఎవ‌రూ ఇవ్వ‌లేదేమో త‌న కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకున్నారు.

Loading...

Leave a Reply

*