గ‌ద్వాల కోట కోసం అరుణ త్యాగం!

aruna

గ‌ద్వాల‌ను జిల్లా చేయాలంటూ ఆందోళ‌న‌లు చేస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ తుది స‌మ‌రానికి సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. గ‌త కొన్నాళ్లుగా పాద‌యాత్ర‌లు, నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు చేస్తున్న అరుణ ఇప్పుడు త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. దీనికి సంబంధించి త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై చర్చించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వం తమ డిమాండ్నుప‌ట్టించుకోక‌పోతుండ‌డంతో ప‌ద‌విని వ‌దిలేసి ఒత్తిడి చేయాల‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇదే విష‌య‌మై త‌న అనుచ‌రుల‌కు ఆమె స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. జిల్లా ఏర్పాటుకు తానే అడ్డ‌మ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లుంద‌ని అందుకే నేరుగా సీఎంకు లేఖ రాసి త‌న ప‌ద‌వి నుంచి వైదొల‌గుతాన‌ని అరుణ ప్ర‌క‌టించిన‌ట్లు ఆ స‌మావేశానికి హాజ‌రైన ఆమె అనుచ‌రులు తెలిపారు.

గ‌ద్వాల జిల్లా కోసం ఇంత‌గా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం మాత్రం ఆ జిల్లాను ఏర్పాటు చేయ‌డానికి స‌సేమిరా అంటోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా గ‌ద్వాల జిల్లా ముగిసిన క‌థ అని దాని ప్ర‌స్తావ‌న ఇక‌పై ఉండ‌బోద‌ని గ‌తంలోనే విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టువీడ‌ని అ రుణ త‌న ఆందోళ‌న‌లు తాను చేసుకుంటూ పోతున్నారు. అలానే దీక్ష‌కు దిగిన అరుణ‌ను కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత ఆమెను జేజెమ్మ‌గా పేర్కొంటూ ఇక గ‌ద్వాల కోట‌కు ప‌రిమితం కావాల‌ని హిత‌వు ప‌లికారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అరుణ తాను జ‌నం కోసం జేజెమ్మ‌నే అవుతాన‌ని తాను జేజెమ్మ అయితే, జ‌నాన్ని పీడిచింన ప‌శుప‌తి నీ తండ్రా అంటూ క‌వితకు ధీటుగా బ‌దులిచ్చిన సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*