ఏపీ మంత్రుల పేప‌ర్ రెడీ!

ap-minsters

ఏపీలో టీడీపీకి వార్తా ప‌త్రిక రెడీ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో సొంత మీడియా లేని పార్టీ టీడీపీ ఒక్క‌టే. కాంగ్రెస్‌కు మీడియా లేకున్నా దానికి ప్ర‌జ‌ల‌లో బ‌లం కూడా లేదు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నేత‌కు చెందిన మీడియా ఆ పార్టీ నేత‌ల‌కంటే ఎక్కువ క్రీయాశీలంగా ఉంది. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ నేత‌లు కూడా తామూ సొంత మీడియాను ఏర్పాటు చేసుకుంటే బావుంటుంద‌ని ఆలోచిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, నారాయ‌ణలు ఒక పేప‌ర్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చారు. దానిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత ప‌త్రిక పెట్టాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న విజ‌య‌ద‌శ‌మి రోజునే చేయాల‌ని గంటా, నారాయ‌ణ‌లు భావిస్తున్నార‌ని స‌మాచారం. అన్నీ అనుకూలిస్తే మంగ‌ళ‌వారంమే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స‌మాచారం. కాగా, ఇప్ప‌టికే గంటా శ్రీ‌నివాస‌రావుకు ఉత్త‌రాంధ్ర‌లో ఓ ప‌త్రిక ఉంది. దానినే విస్త‌రించి రాష్ట్ర‌మంతా పెడ‌తారా లేక కొత్త‌గానే ఓ ప‌త్రిక‌ను ప్రారంభిస్తారా అన్న‌ది మంత్రుల ప్ర‌క‌ట‌న త‌ర్వాతే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*