తెలంగాణ‌కు ఏపీ ఝ‌ల‌క్‌!

ap-and-ts

తాను చేయాల్సింది చేయ‌కుండా.. త‌న‌కు కావాల్సింది మాత్రం గ‌ట్టిగా అడుగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏపీ ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. హైద‌రాబాద్‌లోని స‌చివాల‌యాన్ని కొత్తగా నిర్మించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న కేసీఆర్ అందుకోసం త‌న కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేశారు. అలాగే, ఖాళీ చేసిన ఏపీ స‌చివాల‌యాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరింది. ఇందుకు రాయ‌బారాన్ని న‌డ‌పాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది. కేసీఆర్ అడిగిందే త‌డ‌వుగా న‌ర‌సింహ‌న్ కూడా విజ‌య‌వాడ వెళ్లి చంద్ర‌బాబుతో మాట్లాడి వ‌చ్చారు. అయితే, ఇక్క‌డే ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి చ‌ట్ట‌బ‌ద్ధంగా రావాల్సిన వాటి విష‌యంలో పేచీలు పెడుతూ అడుగడుగునా అడ్డు పుల్ల‌లు పెడుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు కావాల్సిన వాటి గురించి మాత్రం బాగానే డిమాండ్ చేస్తోంద‌ని గ్ర‌హించింది.

దాంతో స‌చివాల‌యం అప్ప‌గించ‌డానికి త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని, అయితే, దానికి ముందుగా 9, 10 షెడ్యూల్ సంస్థల సంగ‌తి తేల్చి చ‌ట్ట‌బ‌ద్ధంగా ఏపీకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే స‌చివాల‌యాన్ని త‌క్ష‌ణ‌మే అప్ప‌గిచేస్తామ‌ని మంత్రివ‌ర్గంలో తీర్మానించింది. ఉన్న‌త విద్యామండ‌లి వ్య‌వ‌హారంలో సాక్షాత్తూ సుప్రీం కోర్టు కూడా ఏపీకి న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన‌వి ఇవ్వాల్సిందేన‌ని తీర్పు చెప్పింది. దానిని అమలు చేయ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం దానిపై మ‌ళ్లీ సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అయితే, అక్క‌డా తెలంగాణ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది. అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా…

ఇప్పుడు మాత్రం స‌చివాల‌యాన్ని అప్ప‌గించాలంటూ డిమాండ్ చేస్తుండ‌డం ఏపీని విస్మ‌యం క‌లిగించింది. గ‌తంలో హైకోర్టు విభ‌జ‌న విష‌యంలోనూ తెలంగాణ ఇలాగే హ‌డావుడి చేసింద‌ని ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు గుర్తు చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*