కేసీఆర్ ఆధ్యాత్మిక గురువుకి ఏపీలో బాబు 210 ఎక‌రాలు రాసిచ్చారు..!

babu-and-kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక గురువుకి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏకంగా 210 ఎక‌రాలు రాసిచ్చారు. కేసీఆర్ స్పిరిచ్యువ‌ల్ గురువు ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఓ వేద పాఠ‌శాల‌ను నెల‌కొల్పాల‌ని భావిస్తున్నారు. వేల మంది విద్యార్దులకు వేద పాఠాలు బోధించే ఈ ఆశ్ర‌మానికి ఏపీ ప్ర‌భుత్వం 210 ఎక‌రాలు కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ట‌. ఇది ఎక్క‌డన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గా మారింది. మరో విష‌యం ఏంటంటే.. గ‌తంలో ఆ కేసీఆర్ ఆధ్యాత్మిక గురువుకి, చంద్ర‌బాబుకి మ‌ధ్య విబేధాలున్నాయ‌నే ప్ర‌చారం ఉంది. తిరుప‌తిలోని వెయ్యికాళ్ల మండ‌పాన్ని చంద్ర‌బాబు తొల‌గించాల‌నుకున్న‌ప్పుడు ఆయ‌న వ‌ద్ద‌ని వారించారు. ఆగ‌మ శాస్త్రాల‌లో పండితుడు అయిన ఆయ‌న వ‌ద్ద‌న్నా బాబు వినిపించుకోలేద‌ట‌. అందుకే, ఆయ‌న రెండు సార్లు అధికారానికి దూర‌మ‌య్యారని ఓ ప్ర‌చారం ఉంది.

ఇంత‌కీ కేసీఆర్ ఆథ్యాత్మిక గురువు ఎవ‌ర‌నే క‌దా..? మ‌రెవ‌రో కాదు.. చిన‌జీయ‌ర్ స్వామి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి అత్యంత స‌న్నిహితులు. ఆయ‌న సూచ‌న‌ల‌తోనే యాదాద్రి పేరు మార్పుతోపాటు ఆల‌య పునర్నిర్మాణం కూడా సాగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు, చిన‌జీయ‌ర్ స్వామి కేసీఆర్ మిత్రుడు, ఆయ‌న కుటుంబానికి స‌న్నిహితుడు అయిన మై హోమ్ రామేశ్వ‌రరావుకి ఆప్తుడు కావ‌డం విశేషం.

వీటితోపాటు కేసీఆర్‌, చంద్ర‌బాబు మధ్య ఇటీవ‌ల స‌యోధ్య న‌డిపింది కూడా చిన‌జీయర్ స్వామియే అని చెబుతారు. ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య వాతావ‌ర‌ణం వేడెక్కినప్పుడు ఆయ‌న చేసిన రాజీనామా ఫార్ములాతోనే ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యార‌ని స‌మాచారం. మ‌రోవైపు, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓటుకి నోటు కేసులో ఇరుక్కున్నార‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో చిన‌జీయ‌ర్ స్వామికి ఇలా భూ దానం  చెయ్య‌డం హాట్ టాపిక్‌గా మారింది.

 

Loading...

Leave a Reply

*