న‌యీం బ్యాచ్‌లో టీఆర్ఎస్ నేత‌!

nayeem

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం బ్యాచ్‌లో తొలి జాబితా విడుద‌లైంది. అందులో తొలి పేరు అధికార టీఆర్ ఎస్‌కు చెందిన నేత‌ది కావ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ మాజీ మంత్రులు, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు న‌యీం వెంట‌ ఉన్నారంటూ జ‌రిగిన ప్ర‌చారాన్ని తోసిరాజంటూ ఇప్పుడు తొలి జాబితా బ‌య‌ట‌కొచ్చింది. న‌యీంతో అంట‌కాగిన వారి జాబితాను సిద్ధం చేసిన సిట్ పోలీసులు ఇప్పుడు చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. సిట్ వెల్ల‌డించిన‌ జాబితా ప్ర‌కారం తెలంగాణ అధికారపక్ష నేతలే ఇందులో ఉండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ శాసనసమండలిలో డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగర్ రావు పేరు అంద‌రికంటే ముందంజ‌లో ఉండ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నేతి విద్యాసాగర్ ఉదంతాన్నే తీసుకుంటే.. ఆయన సమీప బంధువు.. గంగస్వామి రవీందర్ రెడ్డి పేరు మీద బొమ్మాయిపల్లిలో 10 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయించారు.

అంతేనా.. నేతి వారింట్లో పదిహేనేళ్లుగా వంట మనిషిగా పని చేసే నాగయ్య పేరు మీద బొమ్మాయిపల్లిలోనే మరో 10 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయించిన విషయాన్ని సిట్ గుర్తించింది. ‘‘2008లో ఒక రోజు విద్యాసాగర్ రావు వరుసకు కొడుకైన రవీందర్రెడ్డి భువనగిరి తీసుకెళ్లాడు. నాకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని బొమ్మాయిపల్లిలో నా పేరు మీద 10 ఎకరాల భూమి రిజిష్టర్ చేసినట్లు చెప్పాడు. సమయం వచ్చినప్పుడు ఆ భూమిని తమ పేరు మీద మార్చుకుంటామని చెప్పాడు. దీంతో.. భూమి ఎవరిది.. ఎక్కడున్నది అడగలేదు. మా సార్ సంతకం పెట్టమంటే పెట్టేశా’’ అంటూ నాగ‌య్య తన వాంగ్మూలంలో సాక్ష్యం ఇచ్చేశాడు.

ఇక‌, నయింతో సన్నిహితంగా వ్యవహరించిన ప్ర‌ముఖుల జాబితాలో సాయి మనోహర్ (డీఎస్పీ) వెంకటయ్య (కల్వకుర్తి సీఐ), మద్దిపాటి శ్రీనివాస్ (ఏఎస్పీ), బూర రాజగోపాల్ (ఖమ్మం ఎస్సై), మస్తాన్ వలీ (ట్రాఫిక్ సీఐ), చింతల వెంకటేశ్వరరెడ్డి (టీఆర్ ఎస్ నేత), మలినేని శ్రీనివాసరావు (పోలీసు అధికారి) త‌దిత‌ర పేర్లున్నాయి.

Loading...

Leave a Reply

*