బాబుకు తోడు మ‌రొక‌రు!

chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రొక‌రు తోడ‌య్యారు. ఏపీలో ప్ర‌తి ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా కుటుంబ ఆస్తులు ప్ర‌క‌టిస్తున్న రాజ‌కీయ నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది చంద్ర‌బాబే. ఆన‌వాయితీ త‌ప్ప‌కుండా ఈ ఏడాది కూడా రెండు రోజుల క్రిత‌మే ఏపీ సీఎం త‌న ఆస్తుల‌ను కుమారుడితో ప్ర‌క‌టింప‌చేశారు. గ‌త కొన్నేళ్లుగా చంద్ర‌బాబు త‌న ఆస్తుల‌ను ప్ర‌క‌టిస్తున్నా… క‌నీసం ఆయ‌న పార్టీ నేత‌లు కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌ను  అనుస‌రించ‌లేక‌పోయారు. చంద్ర‌బాబు చేస్తున్న ప‌నిని ఆయ‌న పార్టీ నేత‌లే అనుస‌రించ‌క‌పోవ‌డంతో ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌ను ఆస్తులు ప్ర‌క‌టించాల్సిందిగా డిమాండ్ చేసే ప‌రిస్థితి వారికి ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఓ అడుగు ముందుకేశారు. త‌మ అధినేత చంద్ర‌బాబు బాట‌లోనే తాను కూడా ఆస్తుల‌ను ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

త్వ‌ర‌లోనే తాను కూడా ఆస్తుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇదే ఒర‌వ‌డి కొన‌సాగి టీడీపీ నేత‌లంతా ఆస్తుల‌ను బ‌హిరంగ ప‌రిస్తే మిగిలిన ప‌క్షాల‌ను కూడా ఇరుకున పెట్టే అవ‌కాశాన్ని టీడీపీకి దొరుకుతుంది. అది ఫ‌లించి చివ‌ర‌కు రాజ‌కీయ నేత‌లంతా ఎంతో కొంత ఆస్తులు ప్ర‌క‌టించే ప‌నిని చేప‌డితే రాష్ట్రంలో ఒక మంచి సంప్ర‌దాయానికి నాంధి ప‌డిన‌ట్లే.

Loading...

Leave a Reply

*