సీఎంకు అస్వ‌స్థ‌త‌!

himachal-pradesh-cm

మ‌రో ముఖ్య‌మంత్రి మంచాన ప‌డ్డారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్ సోమ‌వారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటీన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సిమ్లాలోని ఐసీఎంసీ ఆస్ప‌త్ర‌లిఓ ప్ర‌స్తుతం వీర‌భ‌ద్ర‌సింగ్ ఉన్నారు. ఆయ‌న‌కు వైద్యులు అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆదివారం నుంచే ముఖ్య‌మంత్రి వీర‌భ‌ద్ర సింగ్ వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. సోమ‌వారం నాటికి అది మ‌రింత తీవ్రం కావ‌డంతో సీఎంను త‌క్ష‌ణం ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని ప్ర‌క‌టించారు.

కాగా, త‌మిళ‌నాడులో ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గ‌త నెల రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్దిగా కోలుకున్న జ‌య‌ను దీపావ‌ళికి ఇంటికి పంపుతామ‌న్న వైద్యులు ఆ త‌ర్వాత నిర్ణ‌యం మార్చుకున్నారు. మ‌రో ప‌ది రోజులు త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉంచుకోవాలని వైద్యులు నిర్ణ‌యించ‌డంతో జ‌య ఇంకా ఆస్ప‌త్రిలోనే ఉన్నారు. దీపావ‌ళి రోజుకు ఇంటికి వెళ్లి పండ‌గ చేసుకోవాల‌నుకున్న జ‌య కోరిక తీరలేదు

Loading...

Leave a Reply

*