అనిత‌కు రోజా ప‌ద‌వి

roj

టీడీపీ ఎమ్మెల్యే అనిత‌కు రోజా మూలంగా అదృష్టం వ‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ద‌స‌రాకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయాల‌ని చంద్ర‌బాబు మొన్న‌టి వ‌ర‌కూ భావించారు. ప్ర‌స్తుతానికి దానికి సంబంధించిన ఊపు క‌నిపించ‌కున్నా… ఒక‌వేళ విస్త‌ర‌ణ జ‌రిగితే ఎమ్మెల్యే అనిత‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబును వైసీపీ నేత‌లు టార్గెట్ చేస్తే…. ఎమ్మెల్యే రోజా స‌హా ప‌లువురు సీఎంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దాంతో పార్టీలో ఉన్న మ‌హిళా మంత్రులు, ఇత‌ర ఎమ్మెల్యేలు స‌రిగా స్పందించ‌కున్నా… ఎమ్మెల్యే అనిత కొంచెం దూకుడుగా ముందుకెళ్లి రోజాతో త‌ల‌ప‌డ్డారు. దాంతో రోజా కూడా అనిత‌ను అన‌రాని మాట‌లు అన‌డంతో విష‌యం పెద్ద‌దైంది. దాంతో అనిత‌పై రోజా చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా తీసుకుని వైసీపీ నేత‌ల కాళ్ల‌కు బంధ‌నాలు వేసింది. ఆ క్ర‌మంలో అనిత కూడా రోజాను ధీటుగా ఎదుర్కొన్నారు. స‌భ‌లోనే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. మీడియా ముందు త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. రోజా మాట జార‌డంతో ఆమెను కార్న‌ర్ చేసి విష‌యాన్ని పార్టీకి అనుకూలంగా మార్చ‌డంలో అనిత చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు అనిత‌కు మంత్రి యోగం క‌ల్పించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*