ఆంధ్ర‌జ్యోతి ఆర్‌కే దెబ్బ‌కి ఈనాడు రామోజీ అవుట్‌…!

untitled-7

టైటిల్‌ను చూసి మ‌రేదో అనుకోకండి. ఇప్పుడంతా సోష‌ల్ మీడియాదే హ‌వా. స్పీడ్ యుగంలో స్పీడ్‌గా ఉంటేనే…! ఆ విష‌యం ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇదే ఆయ‌న‌ను తెలుగులో నెంబ‌ర్ వ‌న్ ఇంట‌ర్‌నెట్ ఎడిషన్‌గా చేసింది.

మొన్న గురువారం వ‌ర‌కూ రాధాక్రిష్ణ ఆంధ్ర‌జ్యోతి ఇంట‌ర్నెట్ ఎడిష‌న్ రామోజీ ఈనాడు ఇంట‌ర్నెట్ కంటే చాలా వెనుకఉంది. ఇప్ప‌డు ఈనాడు.నెట్‌ (ర్యాంకు 109) ని క్రాస్ చేసి ఆంధ్ర‌జ్యోతి.కామ్‌(101) ముందంజ‌లో ఉంది. వాస్త‌వానికి చ‌క్క‌ని రైటింగ్ స్ట‌యిల్, వార్త‌ను వార్త‌గా అందించ‌టం వారి ప‌ద్ధ‌తి. అయితే దానికంటే కొంచెం ముందు వెళ్లి ఇంట‌ర్నెట్ వెర్ష‌న్‌లో కాస్త స్వేచ్చ‌గా ఉండేది ఈనాడు. అయితే అంత‌కంటే స్వేచ్ఛ‌గా ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యం వ్య‌వ‌హ‌రించింది. ఆంధ్ర‌జ్యోతి.కామ్ లో ఒక‌ప్పుడు హాట్ న్యూస్‌లే ఎక్కువ ఉండేవి. ఇపుడ‌ది కాస్త త‌గ్గింది.

అయితే ఆంధ్ర‌జ్యోతి మ‌రి ఈనాడు. నెట్‌ను ఎలా అధిగ‌మించ‌ద‌నేగా మీ డౌట్‌.. దానికి స‌మాధాన‌ముంది. వాస్త‌వానికి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రాసే ప‌త్రిక‌ల‌కూ, ఇంట‌ర్నెట్ ఎడిష‌న్స్‌కి ఎక్కువ ఆద‌ర‌ణ ఉంటుంది. దీనికితోడు అగ్రెసివ్‌గా, ముక్కుసూటిగా, ఉన్న‌ది ఉన్న‌ట్లు బోల్డ్ గా రాసే క‌ల్చ‌ర్ ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాన్యానికి ఉండ‌నే ఉంది. స‌రిగ్గా ఇలాంటి దూకుడుత‌నాన్ని, షాక్ న్యూస్‌ల‌ను పాఠ‌కుడైనా, నెటిజ‌న్ అయినా ఎంజాయ్ చేస్తాడు. ఈ ఫ్లేవ‌రే ఆర్కేని రామోజీకంటే ముందంజ‌లో నిల‌బెట్టింది. మ‌రి ఆంధ్ర‌జ్యోతి.కామ్ స్థానం బ‌లుపా, వాపా అనేది చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Loading...

Leave a Reply

*