ట్రంప్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో వైఎస్సార్‌సీ లీడ‌ర్ హవా..!

untitled-15

అమెరికా అధ్య‌క్ష బ‌రిలో ఆంధ్రుడు నిల‌వాల‌ని ఎన్టీఆర్ గ‌తంలో వ్యాఖ్యలు చేశారు. అది జ‌రుగుతుందో లేదో కానీ… అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో భార‌తీయుల ప్ర‌భావం కీల‌కంగా మారుతోంది. ముఖ్యంగా ఆంధ్రుల ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ‌గానే ఉంద‌ట‌. అయితే, ఈసారి వైట్ హౌస్‌కి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ త‌ర‌ఫున ఒక ఆంధ్రుడు కీ రోల్ పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం అరిజోనా స్టేట్‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ప్రచార ఇన్‌చార్జ్‌గా ఉన్న అవినాశ్ ఇర‌గ‌వ‌ర‌పు… ట్రంప్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు. ఆయ‌నది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు. ల‌ఖ్‌న‌వ్ ఐఐఎమ్ నుంచి ఎమ్‌బీఏ ప‌ట్టా పుచ్చుకున్న అవినాశ్‌.. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌లో జాబ్ ఫొందాడు. ఆ త‌ర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున ప్ర‌చారంలో పాల్గొన్నాడు.

రాజ‌కీయాలు, ఎన్నిక‌ల ప్రచారం, వ్యూహం అంటే అవినాశ్‌కి కాలేజీ రోజుల‌నుంచే ఇంట‌రెస్ట్. అదే ఇప్పుడు అత‌నిని ఈ స్థాయికి తెచ్చేలా చేసింది. 2014 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అమెరికా వెళ్లాడ‌ట‌. ఆయ‌న భార్య అక్క‌డ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌. ఆమెని క‌లుద్దామ‌ని అక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు.. వాళ్ల ఇంటి ద‌గ్గ‌ర‌లో ఒక రోడ్ సైన్ చూశాడ‌ట‌. సిటీ కౌన్సిల్‌కి త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న‌ట్లు సూచిస్తున్న సైన్ అది.

దీంతో, అక్క‌డి ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన అత‌ను.. అరిజోనా ఎన్నిక‌ల‌పై విశ్లేష‌ణ చేశాడు. ఎన్నిక‌ల ఫ‌లితాల డేటాను ఎన‌లైజ్ చేసి అరిజోనా గ‌వ‌ర్న‌ర్‌గా డౌగ్‌డూసీ గెలుస్తాడ‌ని విశ్లేషించి… వారికి ఆ డేటా పంపాడు. డూసీ గెలవడంతో అవినాశ్‌ డేటా విశ్లేషణకు అరిజోనా రిపబ్లికన్‌ పార్టీ చైర్మన్‌ రాబర్ట్‌ గ్రాహం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఏడాది వ్యవధిలోనే అతడు అరిజోనాలో పార్టీ డేటా డైరెక్టర్‌ పదవి నుంచి.. పొలిటికల్‌ డైరెక్టర్‌గా, తర్వాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు అవినాశ్‌.. ట్రంప్ గెలిస్తే.. అవినాశ్ కెరీర్ మ‌రింత బ్రైట్‌గా మార‌డం గ్యారంటీ.

Loading...

Leave a Reply

*