కేసీఆర్‌పై ఫిరాయింపు పిడుగు!

kcrpidugu

తెలంగాణ సీఎంపై మ‌రో పిడుగు ప‌డింది. రెండు రోజుల క్రితం కేంద్రం ఇస్తున్న అభివృద్ధి నిధుల‌తోనే కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందించాలో తెలియ‌క టీఆర్ ఎస్ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హైకోర్టు ఆదేశాలతో అధికార పార్టీ తీవ్ర‌మైన షాక్ అవ‌నుంది. అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను గుప్పిట ప‌ట్ట‌డం మొద‌లెపెట్టారు. విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను సామ‌ధాన‌బేద దండోపాయాల‌ను ప్ర‌యోగించి ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేల‌కు గులాబీ కండువా క‌ప్పారు. ఏకంగా టీడీపీకి చెందిన శాస‌న‌స‌భా ప‌క్షాన్నే టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్లు స్పీక‌ర్‌కు లేఖ ఇచ్చేలా చేశారు. దానిపై టీడీపీ నేత‌లు హైకోర్టుకు ఎక్కారు. కాంగ్రెస్ నేత‌లు సుప్రీం కోర్టు వ‌ర‌కూ వెళ్లారు.

టీడీపీ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల విలీనంపై స్పీక‌ర్‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చింది. మూడు నెల‌ల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్టీ విలీనం లేఖ‌పై త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. అంటే ఇక కాల‌యాప‌న మానేసి ఏదోక నిర్ణ‌యం తీసుకోవాల్సిన బాధ్య‌త స్పీక‌ర్‌పై ప‌డింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. ఇక‌, మ‌రికొన్ని రోజుల్లో సుప్రీం కోర్టులో కూడా కాంగ్రెస్ వేసిన పిటిష‌న్‌పై ఆదేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే నేరుగా స్పీక‌ర్‌కే సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దానిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు వారం గ‌డువు ఇచ్చింది. ఈలోపుగానే వ‌చ్చిన హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో స్పీక‌ర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*