పాక్‌-భార‌త్ దాడుల‌పై అమెరికా సంచ‌ల‌నం..!

ind-vs-pak

బోర్డ‌ర్‌లో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న స‌మ‌యాన‌.. అమెరికా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ఇండియా త‌ర‌ఫున గ‌ళం విప్పింది. పాక్‌పై భార‌త్ స‌ర్జిక‌ల్ దాడులు ఊహించ‌ద‌గిన‌వేన‌ని, ఉగ్ర‌వాదంతో భార‌త్ స‌త‌మ‌త‌మవుతున్న తీరు ప్ర‌పంచానికి తెలిసిందే అని అమెరికా విదేశాంగ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ప్ర‌పంచాన్ని క‌బ‌ళిస్తున్న ఉగ్ర‌వాదంపై త‌మ వైఖ‌రి ఏంటో తెలుస‌ని.. టెర్ర‌రిజం ముప్పుతో భార‌త్ ఎంత బాధ‌ప‌డుతుందో మ‌న‌కు తెలుసు.. అందుకే, ఈ దాడుల‌ను స‌మ‌ర్ధించ‌వ‌ల‌సిందే అని వివ‌రించారు. ఇప్ప‌టికే, ల‌ష్క‌ర్ ఏ తోయిబా, హ‌క్కానీ నెట్ వ‌ర్క్, జైష్ ఏ మొహ‌మ్మ‌ద్ వంటి ఉగ్ర‌వాద గ్రూపుల‌ను తాము నిషేధించామ‌ని తెలిపారు.

అమెరికా.. గ‌తంలో పాక్‌కి స‌న్నిహిత దేశం. భార‌త‌దేశం ఏం చేసినా, ఏం చెయ్యాల‌న్నా ముందుగా అమెరికా త‌ప్పుప‌ట్టేది. కానీ, గ‌త ప‌దిహేనేళ్లుగా భార‌త్ దేశంపై అమెరికా మ‌న‌సు మారింది. ప్ర‌చ్చ‌న్న యుద్ధం స‌మ‌యంలో భార‌త్‌-ర‌ష్యా మ‌ధ్య మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. పాక్‌-అమెరికా మ‌ధ్య‌ స్నేహం కొన‌సాగింది. గ‌త ప‌దిహేనేళ్లుగా ఇండో-అమెరికా సంబంధాలు కొత్త మ‌లుపు తీసుకున్నాయి. బిల్ క్లింట‌న్ హ‌యాం నుంచి ఈ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 9 బై 11 ఎటాక్స్ అని పిలిచే ట్విన్ ట‌వ‌ర్స్ పేలుళ్లు కూడా ఉగ్ర‌వాదంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కిచెప్పాయి.

వీటికితోడు భారత్ వంటి ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను వ‌దులుకోవ‌డానికి అమెరికా సిద్ధంగా లేదు. ఇటు, చైనా అమెరికాకు స‌వాల్ విసురుతోంది. దీంతో, చైనాకు స‌రిహ‌ద్దుగా దేశ‌మైన భార‌త్‌తో చెలిమిగా ఉండాల్సిన అవ‌స‌రం ఆ దేశానికి ఉంది. వీటికితోడు అమెరికాకు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి. భార‌తీయుల ఓట్లు ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో కీల‌క భూమిక పోషించనున్నాయి. అందుకే, ఒబామా స‌ర్కార్ భార‌త్‌కి మ‌ద్ద‌తు తెలుపుతోంది. మోదీ ప్ర‌భుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అది మాకు స‌మ్మ‌తమే వ్యాఖ్యా

 

Loading...

Leave a Reply

*