చంద్ర‌బాబు వారాల‌న్ని బుక్ అయిపోతున్నాయ్‌!

chandra-babu

పాల‌న‌లో చంద్ర‌బాబు కొత్త ప్ర‌యోగాలు చేస్తున్నారు. నిర్దిష్టంగా ఒక్కో కార్య‌క్ర‌మానికి ఒక్కో క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌ను పెట్టుకుని ముందుకు పోతున్నారు. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో జ‌రిగే ఎన్నిక‌ల స‌మ‌యానికి అనుకున్న వాటిలో కొన్నింటినైనా పూర్తి చేయాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబు ఇందుకోసం ప‌టిష‌ట‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నారు. పోల‌వ‌రాన్ని ఎంతోకొంత పూర్తి చేయాల‌ని నిశ్చ‌యించుకున్న సీఎం సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం ప‌నుల పురోగ‌తిపై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఒక్కోరోజు ఆల‌స్య‌మైనా ఆ త‌ర్వాతి రోజైనా దానిపై ఠంచ‌న్‌గా స‌మీక్ష‌లు పెడుతున్నారు. ఆ త‌ర్వాత బుధ‌వారాన్ని రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌కు కేటాయించారు.

అలా రెండు వారాల‌ను బుక్ చేసేసిన చంద్ర‌బాబు ఇప్పుడు శుక్ర‌వారాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఇక‌పై ప్ర‌తి శుక్ర‌వారం మంత్రులు, అధికారులు అంద‌రూ వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో అందుబాటులో ఉండాల‌ని ప్ర‌జ‌లంతా అక్క‌డికొచ్చి త‌మ స‌మస్య‌లు చెప్పుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు జీవో కూ డా విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తి సోమ‌వారం గ్రీవెన్స్‌డే గా పాటిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌లు వినేవారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌ల‌లో ఇందుకోసం ప్ర‌త్యేకంగా అధికారులంతా ఆ రోజున ప‌ని చేసేవారు. ఇప్పుడు మంత్రులు కూడా శుక్ర‌వారం రోజున అందుబాటులో ఉండాల‌ని ప్ర‌జా స‌మ‌స్యలు విని ప‌రిష్కారించాల‌ని తాజా జీవోలో స్ప‌ష్టం చేశారు.

Loading...

Leave a Reply

*