ఆ ఏపీ ఎమ్మెల్యే 15 రోజుల క్రితం 130 కోట్లు మార్చాడ‌ట‌… ఎవ‌రాయ‌న‌..?

untitled-21

ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే 15 రోజుల క్రితం సుమారు 130 కోట్ల బ్లాక్‌మ‌నీని వైట్ చేసుకున్నాడ‌ట‌. ఆయ‌న హ‌డావిడిగా త‌నకు తెలిసిన అకౌంటెంట్‌ల‌ను, బిజినెస్‌మేన్‌ల‌ను క‌లిసి త‌న‌కు అర్జెంట్‌గా వైట్ మ‌నీ కావాల‌ని వివ‌రించాడ‌ట‌. దీంతో, కాస్త త‌క్కువ మార్జిన్‌కే త‌న మనీని వైట్‌గా మార్చుకున్నాడ‌ని స‌మాచారం.ఆ ఎమ్మెల్యే ఎవ‌రనేది హాట్‌టాపిక్‌గా మారింది. రాజ‌ధాని ప్రాంతంలో ఉండే ఆయ‌న టీడీపీ బాస్‌కి, ఆ పార్టీకి కాబోయే వార‌సుడికి కూడా బాగా క్లోజ్ అని అంద‌రూ చెబుతుంటారు.

విప‌క్షాలు టీడీపీ అధినేత‌పై చిన్న ఆరోప‌ణ వ‌చ్చినా విరుచుకు ప‌డుతుంటారు. ఇంత‌లావు నోరేసుకొని ప‌డుతుంటారు. ఇదే ఆయ‌న‌కు క‌లిసొచ్చింద‌ట‌. బీజేపీ పెద్ద‌ల నిర్ణ‌యం ఆ పార్టీలోని పెద్ద‌ల‌కు తెలియ‌డం, వారు స‌ద‌రు ఎమ్మెల్యేకి ముందుగానే చెప్ప‌డంతో వెంట‌నే అలెర్ట్ అయ్యాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంటే, ఏపీలోని పెద్ద‌ల‌కు ఈ నిర్ణ‌యం ముందుగానే తెలుస‌ని, అందుకే చాలా మంది స‌ర్దుకున్నార‌ని చెబుతున్నారు. ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది వారికే తెలియాలి. ఈ లెక్క‌ల గ‌త 45 రోజుల గ్యాప్‌లోనే కొన్ని వేల కోట్ల రూపాయ‌ల బ్లాక్ మ‌నీ వైట్ మ‌నీగా మారి ఉండ‌వ‌చ్చ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇది బ‌య‌ట‌కు తీసుకురాగ‌ల‌రా.. మోదీ గారు..!

Loading...

Leave a Reply

*