మోదీ చేసిన 8 త‌ప్పులివే.. అవి స‌రిచేసుకుని ఉంటే.. సూప‌ర్‌…!

untitled-7

న‌ల్ల‌ధ‌నం నియంత్ర‌ణ‌కు నోట్ల ర‌ద్దు వంటి తీవ్ర‌మైన చ‌ర్య తీసుకున్న ప్ర‌ధాని మోడీ అందుకు సరిగ్గా హోంవ‌ర్క్ చేయలేద‌ని అర్థ‌మ‌వుతోంది. స‌రైన ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుని ఉంటే వారం గ‌డిచిన త‌ర్వాత కూడా మోడీపై ఇంత‌గా వ్య‌తిరేక‌త ఉండేది కాద‌ని ప‌రిశీల‌కుల అభిప్రాయం. ఎంత పెద్ద సంక్ష‌భ‌మైన ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌డితే…. రోజులు, వారాలు గ‌డిచేకొద్ది ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది. అయితే, ప్ర‌స్తుతం దేశంలోని క‌రెన్సీ సంక్షోబం రోజు గ‌డిచే కొద్ది జ‌టిల‌మ‌వుతోంది. దీన్ని గ‌మ‌నించిన ఆర్థిక నిపుణులు, రాజ‌కీయవేత్త‌లు మోడీ చేసిన త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నారు. వాటిలో కొన్ని…..

1.దేశంలోని క‌రెన్సీలో 80 శాతంగా ఉన్న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసే ముందు దానికి ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర డినామినేష‌న్ నోట్లు అందుబాటులోకి తేలేక‌పోవ‌డం.
2. 1000, 500 వంద‌లు నోట్లు ర‌ద్దు చేస్తూ.. అంత‌కంటే పెద్ద‌దైన రెండు వేల నోటు తీసుకురావ‌డం.
రెండు వేల నోటు వ‌ల్ల చిల్ల‌ర స‌మ‌స్య తీవ్ర‌మైంది.
3. రెండు వేల నోటు తేవాల‌నుకున్న మోడీ దాన్ని ప‌రిమితంగా తెచ్చినా… మ‌రింత పెద్ద సంఖ్య‌లో వంద నోట్ల‌ను అందుబాటులో పెట్టి ఉండాల్సింది.
4. ముందుగా ఏటీఎం మిష‌న్ల‌లో మార్పులు తీసుకురాక‌పోవ‌డం… పైగా కొత్త‌గా వ‌చ్చిన రెండు వేల నోటును విభిన్న‌మైన సైజులో తేవ‌డంతో ఏటీఎంలు స‌మూలంగా ప్ర‌క్షాణ‌ళ చేయాల్సి వ‌స్తోంది.
5. పాత వెయ్యి లేదా ఐదొంద‌లు సైజులో రెండు వేల నోటు వ‌చ్చినా… స్వ‌ల్ప మ‌ర‌మ్మ‌త్తుల‌తో ఏటీఎంలు జ‌నానికి అందుబాటులోకి వ‌చ్చేవి.
6. అలాగే, చాలిన‌న్ని వంద నోట్లు జ‌నానికి అందుబాటులోకి తేక‌పోవ‌డం. దీనికి పెద్దెత్తున వంద నోట్లు అందుబాటులో పెట్టాల‌ని బ్యాంకుల‌కు 15 రోజుల ముందుగానే హెచ్చ‌రిక‌లు పంపాం అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.
7. బ్యాంకులకు అలా ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసిన వెంట‌నే మోడీ అనూహ్యంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డంతో వంద నోట్లు రెడీ చేసుకోవ‌డానికి బ్యాంకుల‌కు స‌మ‌యం లేకుండా పోయింది.
8. కొత్త‌గా మ‌ళ్లీ ఐదొంద‌లు నోటు తెచ్చినా అది కూడా స‌రైన స‌మ‌యంలో ఇప్ప‌టికీ ఇంకా అన్ని ప్రాంతాల‌కు చేర‌క‌పోవ‌డం.

మొత్త‌మ్మీద‌, మోదీ ఈ ఎనిమిది త‌ప్పుల‌ను ముందే స‌రిచేసుకుని ఉంటే.. ఇంత ప్ర‌భావం ఉండేది కాద‌ని మేధావులు చెబుతున్నారు

Loading...

Leave a Reply

*