సింధు పంట పండింది.. 50 కోట్ల ఆఫ‌ర్ ద‌క్కింది..!

sindhu

ఒలింపిక్స్ విజేత పీవీ సింధు పంట పండుతోంది. అక్క‌డ ప‌త‌కం కొట్ట‌గానే ఇక్క‌డ కోట్ల క‌ట్ట‌లు ఆమె ఇంటి త‌లుపు త‌ట్టాయి. తెలుగు రాష్ట్రాలే ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌ను భారీ న‌జ‌రానాగా ప్ర‌క‌టించ‌గా… దేశంలోని చాలా రాష్ట్రాలు మ‌రికొన్ని కోట్లు కుమ్మ‌రించాయి. ఆ కోట్ల నోట్ల వాన‌లో సింధూ త‌డిసి ముద్ద‌యింది. దేశ‌మంగా స‌న్మానాలు స‌త్కారాలతో తుల‌తూగింది. ఇప్పుడు ఆమెను త‌మ బ్రాండ్ చేసుకునేందుకు త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకునేందుకు కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి.

ఆ క్ర‌మంలోనే సింధూకు ఒక  కంపెనీ అక్ష‌రాల 50 కోట్ల రూపాయ‌ల డీల్‌ను ఆఫ‌ర్ చేసింద‌ట‌. బేస్‌లైన్ అనే స్పోర్ట్స్  అనే సంస్థ ఆమె త‌ర‌ఫున బ్రాండింగ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చింద‌ని తెలిసింది. ప‌లు ఉత్ప‌త్తుల ప్ర‌చారానికి సింధుతో ఆ సంస్థ‌ సైన్ చేయించుకుంద‌ని ఇందుకోసం రూ.50 కోట్ల‌కు ఒప్పందం చేసుకుంద‌ని తాజా వార్త. త‌న బ్రాండ్ ఎంత పెరిగినా సింధూ మాత్రం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాల‌న్న సూత్రాన్ని పాటిస్తూ త‌న ప్ర‌త్యేక్య‌త‌ను చాటుకుంటుంద‌ని స‌ద‌రు బేస్‌లైన్ సంస్థ ప్ర‌శంసించిన‌ట్లు స‌మాచారం.

Loading...

Leave a Reply

*