40 మంది ఎమ్మెల్యేల‌కు డీ గ్రేడ్‌!

tdp-mlas

టీడీపీలో ఎమ్మెల్యేల గ్రేడింగ్ ర‌చ్చ న‌డుస్తోంది. ఎవ‌రికి వారు చంద్ర‌బాబు ఇచ్చిన కవ‌ర్ల‌ను సీక్రెట్ లాక‌ర్ల‌లో పెట్టేసుకున్నా… బ‌య‌ట మాత్రం చ‌ర్చ సాగుతూనే ఉంది. ఏ గ్రేడ్‌లో ఉన్న వారి ముఖాల‌న్నీ సంతోషంతో వెలిగిపోతుండ‌డం… చివ‌రి సీ, డీ గ్రేడుల్లో ఉన్న వాళ్ల ఫేసుల‌న్నీ నిర‌సంతో వేలాడుతుండ‌డాన్ని బ‌ట్టి ఎవ‌రి అంచానాలు వారు వేసుకుంటున్నారు. అయితే, అన‌ధికారిక స‌మాచారం ప్ర‌కారం దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌కు డీ గ్రేడ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరి ప‌నితీరు మెరుగుప‌డ‌క‌పోతే… పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే ఆ న‌ల‌భైమంద‌ని త‌క్ష‌ణం అప్ర‌మ‌త్తం చేసి వారు మారి…. ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి పెంచుకునేలా చేయ‌కుంటే పుట్టి మునుగుతుంద‌న్న ఆందోళ‌న చంద్ర‌బాబులో ఉంది.

మ‌రోవైపు ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌త్యామ్నాయ నేత‌ల‌ను త‌యారు చేయ‌డం ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి కాక‌పోవ‌డం కూడా చంద్ర‌బాబును తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యేల‌కే వాస్త‌వ ప‌రిస్థితి తెలియ‌జేసి మీరు మున‌గ‌డ‌మే కాకుండా పార్టీనీ ముంచేస్తున్నార‌న్న విష‌యాన్ని వాళ్ల‌కు తెలిసేలా చేయ‌డ‌మే చంద్ర‌బాబు గ్రేడింగ్ ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్లు ఉన్నందున డీ గ్రేడ్‌లో ఉన్న వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చి అప్ప‌టికీ వారు మార‌కుంటే కొద్దికాలం త‌ర్వాత వారికి ప్ర‌త్యామ్నాయాన్ని త‌యారు చేసుకోవ‌చ్చ‌న్న‌ది పార్టీ పెద్ద‌ల వ్యూహంగా తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*