టీఆర్ఎస్‌కు వంద‌శాతం ఎమ్మెల్యే స్థానాలు

trs

కాంగ్రెస్ కంచుకోట నారాయ‌ణ్‌ఖేడ్‌లో టీఆర్ఎస్ సునాయ‌స విజ‌యం. ఆంధ్ర ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఖ‌మ్మం జిల్లా పాలేరులో అధికార పార్టీ అల‌వోక విజ‌యం. అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు, ఆంధ్ర‌ప్రాంత‌వాసులు ఎక్కువ‌గా ఉండే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓట్ల సునామీ. ఇదంతా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగింది. ఇక ఇప్ప‌టికిప్పుడు రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రిగితే రాష్ట్ర‌మంతా టీఆర్ఎస్ హ‌వా కొన‌సాగుతుంద‌ట‌. మొత్తం అసెంబ్లీ స్థానాల‌లో దాదాపుగా వంద‌శాతం టీఆర్ ఎస్ ఖాతాలోకి వ‌చ్చేస్తాయ‌ట‌. ఢిల్లీలో కేజ్రివాల్ సృష్టించిన రికార్డు తెలంగాణలో కేసీఆర్ సొంతం అవుతుంద‌ట‌. తాజాగా జ‌రిగిన స‌ర్వే ప్ర‌కారం రాష్ట్రంలోని 119 స్థానాల‌లో 99.9999% సీట్లు అధికార పార్టీవేన‌ని తేలింద‌ట‌.ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్‌కు 109 స్థానాలు ఖాయ‌మ‌ని తేలింద‌ట‌.

సెంటర్ ఫర్ సెఫాలజీ నిర్వహించిన ఈ సర్వేలో 119 స్థానాలుగా ఉన్న తెలంగాణలో 109 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తాయని తేలింది. ఈ స‌ర్వేతో తెలంగాణ‌లోని అధికార పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ పనితీరుకు, టీఆర్ఎస్ ప్రజాహిత పాలనకు స‌ర్వే ఫ‌లితాలే తార్కాణ‌మ‌ని వారు పేర్కొంటున్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నార‌ని ఆయ‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని రాష్ట్ర ప్ర‌జానీకం భావిస్తోంద‌ని ఈ స‌ర్వేతో వెల్ల‌డైంద‌ని ప‌లువురు నేత‌లు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోన్న పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే.. సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయి అంటూ ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

Loading...

Leave a Reply

*