మీ సెల్ పోయిందా.. నో ప్రాబ్ల‌మ్‌.. కొత్త ఫోన్ పొంద‌డం చాలా ఈజీ…!

mob

మీ సెల్‌ఫోన్ పోయిందా..? లేదంటే… ఎవ‌ర‌యినా దొంగిలించారా..? అయినా బేఫిక‌ర్‌. మీ సెల్ మీకు తిరిగి వ‌చ్చే ప‌రిష్కారం ఇక్క‌డ ఉందంటున్నారు. అయితే, దానికి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్క‌టే. మీ సెల్‌ఫోన్‌కి బీమా చేయించండి. అలా ఇన్సూరెన్స్ చేపిస్తే చాలు.. మీ సెల్ పోయినా ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దంటున్నారు బీమా సంస్థ‌ల అధికారులు. ఎన్ని వేలు పోసి కొన్నా.. మీ మ‌నీకి, మీ సెల్‌ఫోన్‌కి గ్యారంటీ ఇస్తారంట‌.. సో.. మీరు ఎంజాయ్ చేయొచ్చు.. ముందుగా మీసెల్ కొన్న వెంట‌నే దానికి బీమా చెల్లించండి. మీ సోల్‌ఫోన్ పోయిన‌వెంట‌నే మీరు ద‌గ్గ‌ర‌లోని పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చెయ్యాలి. లేదంటే మీ సేవా సెంట‌ర్‌ల‌లోనూ కంప్ల‌యింట్ చెయ్య‌వ‌చ్చు.

ఆ త‌ర్వాత పోలీసులు విచార‌ణ జ‌రిపి మీ-సేవా కేంద్రం నుంచి బాధితుడికి స‌ర్టిఫికెట్ ఇస్తారు. మీ సెల్‌ఫోన్ ఎవ‌ర‌యినా దొంగిలిస్తే… పోలీసులు ఎంక్వ‌యిరీ చేసి ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తారు. అయితే, మీ మొబైల్‌ని ఎవ‌రయినా దొంగిలిస్తే.. ఆ ఫోన్ ఐఎమ్ఈ నెంబ‌ర్ ద్వారా గుర్తించే చాన్స్ ఉంటుంది. పోలీసులు వెంట‌నే వెబ్‌సైట్ ద్వారా ఆ ఐఎమ్ఈ నెంబ‌ర్‌తో వాడుతున్న సిమ్ నెంబ‌ర్‌ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో, సెల్‌ఫోన్ వాడుతున్న వారి అడ్ర‌స్‌ని ఈజీగా నిర్దారించుకోవ‌చ్చు. అయితే, సెల్‌ఫోన్‌లో సాఫ్ట్ వేర్ మార్చితే ఇది కష్ట‌మ‌ట.

ఎలాంటి ప్ర‌మాదంలో అయినా మీ సెల్‌ఫోన్‌ పాడైనా, ఎవరైనా అపహరించినా, ఎక్కడైనా పడిపోయినా బీమా చేయించి ఉంటే కొంత దీమాగా ఉండవచ్చు. ఎందుకంటే సెల్‌ఫోన్‌కు బీమా ద్వారా కొంతవరకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకుగాను తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కొందరు షాపు నిర్వాహకులు కొనుగోలు చేసిన ఫోన్లపై బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. రూ. 20వేల విలువైన మొబైల్‌కు ఏడాదికి రూ.150, అంతకు మించి ధరలు పలికే ఫోన్లకు రూ.300, ఆపై చిలుకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని బీమా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయినా, ప్రయాణ సమయంలో, రోడ్డు ప్రమాదంలో పాడైపోయినా, చోరికి గురైనా బీమా వర్తింపు ఉంటుంది. వ్యక్తి అజాగ్ర‌త్త‌తో సెల్‌ఫోన్‌ మరిచిపోయినప్పుడు, సరైనకారణాలు లేకుండా, కనిపించకుండా పోయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాడైతే బీమా వర్తించదు. అలాగే సెల్‌ఫోన్‌ మరమ్మతు చేసే సందర్భంలో పాడైతే, ఫోన్‌ సామర్ధ్యం తగ్గి పనిచేయకండా పోయినా బీమా వర్తించదు.

Loading...

Leave a Reply

*