కేసీఆర్‌పై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. యండ‌మూరిని ఉతికి ఆరేస్తున్న తెలంగాణ వాదులు…!

yanda

యండ‌మూరి వీరేంద్ర‌నాధ్‌..ప‌రిచ‌యం అక్క‌ర్లేని స్టార్ న‌వ‌లా రైట‌ర్‌. 80వ ద‌శ‌కంలో క‌మ‌ర్షియ‌ల్ నావెల్ ప్ర‌పంచాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఘ‌నుడు ఆయ‌న‌. టీవీలు, సీరియ‌ల్స్ రాక‌తో ఆయ‌న కాస్త వెనుక‌బ‌డ్డారు. ఎప్పుడూ సంచ‌ల‌న క‌థ‌నాల‌తో వివాదాలు సృష్టించే ఈ నవలా ర‌చ‌యిత తాజాగా ఓ కాంట్ర‌వ‌ర్సీలో చిక్కుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టి వారి ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అంతే, ఆయ‌న‌ను ఉతికి ఆరేస్తున్నారు తెలంగాణ వాదులు. దీంతో, వెన‌క్కిత‌గ్గి.. త‌న పోస్ట్ మార్చుకున్నా.. ఏమాత్రం ఉపేక్షించడం లేదు ఆయ‌న‌ని.. సింపుల్‌గా ఉతికి ఆరేస్తున్నారు టీవాదులు.ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారుల మీటింగ్‌లో ఇలా అన్నారంటూ.. ఆయ‌న సొంత ఫేస్‌బుక్‌లో ఇలా ఉంది….తెలంగాణ ముఖ్యమంత్రి అధికారుల‌తో స‌మావేశ‌మయ్యారు..

“ తిరుప‌తికి కోట్ల ఆదాయం వెళ్లిపోతోంది. మన ఇంజనీర్‌లు న‌ల్గొండ‌లో నాలుగు కొండ‌ల‌ను గుర్తించారు. ఏ దేవుడు పాపుల‌ర్ అవుతాడో ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి క‌లిసి నిర్ణయిద్దాం. త‌వ్వ‌కాల్లో దొరికినట్లు.. ఓ విగ్ర‌హాన్ని తీసుకొచ్చి ప్ర‌తిష్టించండి. ముందు చిన్న గుడి క‌ట్టండి.. ఆ త‌ర్వాత పెద్ద గుడి నిర్మించండి.. ఆ నాలుగు కొండ‌ల దేవుడి లీల‌లు దావాన‌లంలా వ్యాపించాలి. క‌థ‌లు సృష్టించండి. పాపులారిటీ పెంచండి. పుష్క‌రాల్లాంటి ప‌దాలు కొత్త‌గా వెత‌కండి.. టీవీల్లో ప్ర‌వ‌చ‌నాలు చెప్పేవారిని నియ‌మించండి. దీనికంత‌టికీ మూడు సంవ‌త్స‌రాలు టైమ్ ఇస్తున్నాను. వంద‌కోట్లు శాంక్ష‌న్ చేస్తున్నాను..“ సమావేశం ముగిసింది.

ఇదీ యండ‌మూరి త‌న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌. దీనిని చూసి తెలంగాణ వాదులు అగ్గిమీద గుగ్గిల‌మవుతున్నారు. యండ‌మూరి పోస్ట్‌పై విరుచుకుప‌డుతున్నారు. దీంతో, ఆయ‌న ఏం చేశాడో తెలిసొచ్చిందో ఏమో…. ఫేస్‌బుక్ పోస్ట్‌ని ఎడిట్ చేసి కొత్త‌గా పెట్టాడు. తెలంగాణ‌కు బ‌దులు.. త‌మిళ‌నాడు అని పెట్టాడు. దానికి 2022 అని జ‌త చేసి న‌ల్గొండ స్థానంలో మ‌హాబ‌లిపురం పెట్టాడు. అయితే, అప్ప‌టికే లేట్ అయింది. ఆ పోస్ట్ తెలంగాణ వాదుల కంట ప‌డ‌డంతో ఆయ‌న ఫేస్‌బుక్‌పై విరుచుకుప‌డుతున్నారు. మెస్సేజ్‌ల వార్ న‌డిపిస్తున్నారు.దీంతో, పూర్తిగా వెన‌క్కిత‌గ్గిన యండ‌మూరి.. గుడి క‌ట్టి భగ‌వంతుణ్ని క్యాష్ చేసుకోవడం వెనుక కొందరు హ‌ర్ట్ అయ్యార‌ని…

వారికి క్ష‌మాప‌ణలు అంటూ త‌న పోస్ట్‌ని డిలీట్ చేశాడు. అయినా తెలంగాణ‌వాదులు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఆయ‌న గ‌తాన్ని త‌వ్వే ప‌నిలో ప‌డ్డారు. ఆయ‌న ర‌చ‌న‌ల క్రెడిట్ అంతా ఆయ‌న ఘోస్ట్ రైట‌ర్‌ల‌దేన‌ని, ఇంగ్లీష్ న‌వ‌ల‌ల‌ను కాపీకొట్టి తెలుగులో రాసి.. సొంత క‌థ‌ల‌న్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చే నువ్వు రైట‌ర్‌వా అంటూ విరుచుకుప‌డుతున్నారు. ఆయ‌న‌ను ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేస్తున్నారు.కొన్ని రోజుల క్రితం..రామ్‌చ‌ర‌ణ్‌పై ఆయ‌న చేసిన కామెంట్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. మెగాభిమానులు ఆయ‌న‌కు చుక్క‌లు చూపించారు. తాజాగా కేసీఆర్ వివాదంతో ఆయ‌న మరోసారి కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా మారాడు. మ‌రి, దీని నుంచి ఆయ‌న ఎలా బ‌య‌ట‌పడ‌తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*