పెద్ద నోట్ల ర‌ద్దును వారికి ముందే లీక్ చేసింది ఎవ‌రు..?

untitled-14

దేశంలో ఆర్ధిక ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తున్న రూ.500, రూ.1000 నోట్ల ర‌ద్దు నిర్ణయం కొంద‌రికి ముందుగానే తెలుసా..? ఆ విషయంపై వారికి లీక్‌లు వ‌చ్చాయా..? సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న క‌థ‌నాల‌ను చూస్తే.. ఇది నిజ‌మే అనిపిస్తోంది. ముఖ్యంగా రెండు నెల‌ల క్రిత‌మే ఈ నిర్ణ‌యం గుజ‌రాత్‌లోని కొంద‌రు బ‌డా పారిశ్రామిక వేత్త‌లు, పెట్టుబ‌డి దారుల‌కి స‌మాచారం అందిందని తెలుస్తోంది. దీంతో, వారు ముందుగానే అప్ర‌మ‌త్త‌మై చ‌ట్టంలోని లోపాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న త‌మ బిజినెస్‌ల‌ను అన్నింటినీ మార్చేసుకున్నార‌ని స‌మాచారం.

సోష‌ల్ మీడియాలో రీసెంట్‌గా కొన్ని క్లిప్పింగ్‌లు క‌నిపిస్తున్నాయి. వాటి సారాంశం ఏంటంటే.. కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పెద్ద నోట్ల‌ను ఉప‌సంహరించుకోవ‌డానికి రెడీ అవుతుంద‌ని. అయితే, ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి రెండు నెల‌ల ముందే ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నేది దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒక స్థానిక ప‌త్రికాధిప‌తికే కేంద్ర నిర్ణ‌యంపై ముందుగానే ఉప్పందిన‌ప్పుడు ఇక‌, అంబానీ, అదానీల సంగ‌తేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు.

గుజ‌రాత్‌లో ప్ర‌చురిత‌మైన ఆ క‌థ‌నాలు.. మొద‌ట బ‌డా పారిశ్రామిక వేత్త‌ల‌కు, పెట్టుబ‌డి దారుల‌కు మాత్ర‌మే తెలుస‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ఆ మేట‌ర్ రాజ‌కీయ నేత‌ల‌తోపాటు మాఫియా లీడ‌ర్‌లకు తెలిసే చాన్స్ ఉంద‌నే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. ఆ రెండు క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో, ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు కావాల్సిన వారికి దీనిపై ముందుగానే లీక్‌లు వ‌చ్చాయ‌ని, వారంతా సెట్ రైట్ అని భావించిన త‌ర్వాతే ఓ నిర్ణ‌యం వ‌చ్చింద‌ని చెప్పుకుంటున్నారు. దీంతో, బీజేపీ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప‌లు అనుమానాలు తలెత్తుతున్నాయి.

Loading...

Leave a Reply

*