షాక్.. ఒకేసారి 30వేల మంది ఉద్యోగుల‌పై వేటు..!

unnamed

వోక్స్‌వాగ‌న్ కంపెనీ తెలుసా మీకు..? రెనాల్ట్‌, డ‌స్టర్ వంటి మోడ‌ల్స్‌తో జనాల‌కు బాగా ద‌గ్గ‌ర‌యింది ఈ జ‌ర్మ‌నీ కారు. గ‌తంలో ఏటి సేత్తాం.. సొమ్ముల పోనాయి అని బొత్స స‌త్య‌నారాయ‌న చెప్పింది ఈ కంపెనీతో చేసుకున్న డీల్‌తోనే. అలాంటి కంపెనీకి ఇప్పుడు క‌ష్టకాలం మొద‌ల‌యింది. కార్బ‌న్ ఉద్గారాల స్కామ్‌లో ఆ కంపెనీ భారీ న‌ష్టాల‌ను మూటగ‌ట్టుకుంది. వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. దీంతో, 2021లోపు ద‌శ‌ల వారీగా 30వేల మంది ఉద్యోగుల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట వోక్స్ వాగ‌న్‌. మొద‌ట ఒకేసారి తీసేయాల‌ని భావించినా లేబ‌ర్ రూల్స్ ఒప్పుకోవ‌ని వారికి అర్ధ‌మ‌యింద‌ట‌. అందుకే, రాబోయే అయిదేళ్ల‌లో విడ‌త‌ల వారీగా 30వేల మందిని ఇంటికి పంపించాల‌ని భావించిన‌ట్లు స‌మాచారం.

నష్టాల‌లో కూరుకుపోయిన కంపెనీని లాభాల బాట‌లో న‌డిపించాల‌న్నా, ఎల‌క్ర్టిక్‌, స్వీయ నియంత్ర‌ణ కార్ల వైపు త‌మ బిజినెస్‌ను మ‌ర‌ల్చుకోవ‌డానికి ఇది సాయ‌ప‌డుతుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు భావిస్తున్నారు. వోక్స్‌వాగ‌న్‌కి యూర‌ప్‌లో మంచి డిమాండ్ ఉంది. పీపుల్స్ ఆటోగా పిలుచుకుంటారు జ‌ర్మ‌న్‌లు దీనిని. కానీ, క‌ర్బ‌న్ ఉద్గారాల స్కామ్‌లో కంపెనీ దారుణంగా ఇరుక్కుపోవ‌డంతో వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌లో మునిగిపోయింది. దీంతో, ఒక్క జ‌ర్మ‌న్‌లోనే దాదాపు 23వేల మంది ఉద్యోగుల‌పై వేటు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో, కంపెనీకి సుమారు 27వేల కోట్లు ఆదా అవుతుంద‌ని అంచ‌నా. వోక్స్ వాగ‌న్‌లో మొత్తం 6ల‌క్ష‌ల 10వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 30 వేల మంది అంటే దాదాపు అయిదు శాతం.

Loading...

Leave a Reply

*