పాపం.. కుళ్లిపోయి దొరికిన విల‌న్‌ల‌ మృత‌దేహాలు..!

untitled-12

క‌ర్ణాట‌క‌లో సినిమా షూటింగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంతో ఇద్ద‌రు న‌టులు విగ‌త జీవులైన సంగ‌తి తెలిసిందే. ఉత్సాహంగా సిన్ చేసేందుకు వెళ్లిన ఇద్ద‌రు ఫైట‌ర్లు… ఇప్పుడు కుళ్లిన మృత‌దేహాలై క‌నిపించ‌డం అంద‌రినీ తీవ్ర వేద‌న‌కు గురి చేస్తోంది. నాలుగు రోజుల క్రితం మాస్తిగుడి సినిమా ప‌తాక స‌న్నివేశం షూటింగ్ సంద‌ర్భంగా న‌టులు ఉద‌య్‌, అనిల్‌లు న‌దిలో గ‌ల్లంతైన సంగ‌తి తెలిసిందే. వీరిలో ఉద‌య్ మృత‌దేహం ఆదే రోజు బ‌య‌ప‌ట‌డింది.ఇప్పుడు తాజాగా అనిల్ మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తిగా కుళ్లిపోయిన స్తితిలో ఉండ‌డంతో మృత‌దేహాన్ని రిజ‌ర్వాయ‌రు వ‌ద్దే పోస్టుమార్టం నిర్వ‌హించారు.

దాదాపు 50 మంది గ‌జ ఈత‌గాళ్లు రిజ‌ర్వాయ‌రు మొత్తాన్ని గాలించి నాలుగు రోజుల త‌ర్వాత అనిల్ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీయ‌గ‌లిగారు. సినిమా యూనిట్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని జ‌ల‌మండలి అధికారులు ఆరోపిస్తున్నారు. తాము ముందుగా చెప్పిన‌ప్ప‌టికీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా వ్య‌వ‌హ‌రిండ‌చం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైంద‌ని, ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని వారు చెబుతున్నారు. దీంతో సినిమా యూనిట్ స‌భ్యుల మీద రామ‌న‌గ‌ర జిల్లా తావ‌ర‌కెరె పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304 (ఆ), 308 కింద నిర్మత, దర్శకుడు మీద నాన్ బెయిల్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Loading...

Leave a Reply

*