జ‌గ‌న్ హోదా పోరు వృథా అని ఉండ‌వ‌ల్లి ఎందుక‌న్నారు!

jagan

ఏపీకి ప్ర‌త్యేక హ‌దా ఇచ్చేది లేద‌ని కేంద్రం తెగేసి చెప్పింది. చంద్ర‌బాబు కూడా కేంద్రం ఇస్తానంటున్న ప్యాకేజీకి ఫిక్స‌యిపోయారు. బీజేపీ నేత‌లు వెంక‌య్య త‌దిత‌రులు అప్పుడే ప్యాకేజే బెస్టంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. ప్ర‌జ‌లు ఒక‌వైపు హోదా కోసం ఉద్య‌మిస్తున్నా తాము చెబుతున్న విష‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు హోదా కంటే ప్యాకేజే మంచిద‌ని అర్థం చేసుకుంటున్నార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షాలు మాత్రం హోదా తెస్తామ‌ని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.

హోదా ఎలా తేవాలో త‌న‌కు తెలుసున‌న్న ప‌వ‌న్ దానికి కోసం త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌న్నారు. జ‌గ‌న్ యువ‌భేరీలు నిర్వ‌హిస్తూ హోదాపై బాబు రాజీ ప‌డ్డార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డే బాబు కేంద్రానికి లొంగిపోయి హోదాను తాక‌ట్టు పెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు.చంద్ర‌బాబు మాత్రం తానెవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని హోదాకు మించి ప్ర‌యోజ‌నాలు సాధించాన‌ని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హోదా వ‌ద్దా, కావాలా అంటూ ప్ర‌జాభిప్రాయం సేక‌రిస్తోంది.

వీట‌న్నింటి నేప‌థ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ హోదా రావాలంటే ఏకైక మార్గం ఒక్క‌టే ఉంద‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్యంలో మెజార్టీ అభిప్రాయానిదే విజ‌య‌మ‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. జ‌గ‌న్ ఇలా మ‌రో రెండేళ్లు పోరాడిన ఏమీ కాద‌ని స్ప‌ష్టం చేశారు. హోదా కోసం ప‌వ‌న్‌, జ‌గ‌న్, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులంతా ఏక‌మై రాబోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో పోటీ చేసి టీడీపీ, బీజేపీకి గుణ‌పాఠం చెబితే అప్పుడే రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

Loading...

Leave a Reply

*