ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ చ‌నిపోయాడంటే.. పాక్‌ క్రికెట‌ర్ చాలా బాగుంది.. వెరీ నైస్ అన్నాడు..!

untitled-7-copy

పాక్ క్రికెట‌ర్‌ల‌కు ఇంగ్లీష్ అంత‌గా రాదు. అందుకే, కొన్ని సార్లు వాళ్లు వెతికి వెతికి మరీ కెప్టెన్సీని కాస్త నాలుగు ముక్క‌లు ఇంగ్లీష్ వ‌చ్చిన వారికి అప్ప‌గిస్తుంటారు. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైన ప‌రువు కాపాడుకోవ‌డానికి ఈ ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కొంత‌మంది పాక్‌ క్రికెట‌ర్‌ల‌క‌యితే పొట్ట కోస్తే అక్ష‌రం ముక్క ఇంగ్లీష్ రాదు అని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తుంటాయి. ఆ సంగతి ప‌క్క‌న‌పెడితే.. రీసెంట్‌గా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న పాక్ క్రికెట‌ర్‌ల ఇంగ్లీష్ బాగోతాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. గ‌తంలో ఇంజ‌మాముల్ ఉల్ హ‌క్‌, యూనిస్ ఖాన్‌, షోయ‌బ్ అఖ్త‌ర్ వంటి వారు ఇంగ్లీష్‌లో మాట్లాడ‌లేక న‌వ్వులు పాల‌య్యారు. ఆఫ్ ది ఫీల్డ్‌లో న‌వ్వులు పూయించారు.

ఈ లిస్ట్‌లోకి ఉమ‌ర్ అక్మల్ కూడా చేరిపోయాడు. పాకిస్థాన్‌ మాజీ కోచ్‌ డేవ్‌ వాట్‌మోర్‌ పెట్టిన ఓ ట్వీట్‌ మీద ఉమర్‌ స్పందించిన తీరు ట్విట్ట‌ర్‌ జనాల్ని విస్మయానికి గురి చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టాంగిల్స్‌ మృతి చెందిన విషయాన్ని వాట్‌మోర్‌ ట్విటర్లో తెలియజేస్తూ నివాళి అర్పించగా.. దానికి ‘చాలా బాగుంది’ (వెరీ నైస్‌) అని స్పందించాడు ఉమర్‌. ఈ ట్వీట్‌కు ఒక స్మైలీ కూడా జోడించాడు. దీంతో ఒక్కసారిగా ట్విటర్లో ఉమర్‌ మీద జోకులు పేలాయి. ఐతే మరో పాక్‌ ఆటగాడు షెజాద్‌.. ఉమర్‌ను హెచ్చరించడంతో అతను సర్దుకున్నాడు. పొరబాటున అలా స్పందించానని.. మన్నించాలని మరో ట్వీట్‌ పెట్టాడు.

Loading...

Leave a Reply

*