ఇద్ద‌ర‌మ్మాయిలు బ‌హిరంగంగా సెక్స్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

untitled-12

ఆధునిక జీవన శైలిలో ఎన్నో కొత్త పోక‌డలు, వింత ధోరణులు క‌నిపిస్తున్నాయి. అందులో భాగమే ఈ లెస్బియ‌న్ సెక్స్‌. అస‌హ‌జ శృంగార ధోర‌ణుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న ఇద్ద‌రు అమ్మాయిల‌ను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకి పంపారు.ఇది ఆఫ్రికాలోని మొరాకోలో జ‌రిగిన క‌థ‌… మొరాకోలో ఇద్ద‌రు బాలిక‌ల‌ను స్వ‌లింగ సంపర్కం కింద అరెస్ట్ చెయ్య‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌హిరంగంగా కిస్సులు పెట్టుకొని, కౌగిలించుకున్నార‌న్న కార‌ణంతో 16, 17 ఏళ్ల వ‌య‌సున్ ఇద్ద‌రు బాలిక‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినిఅరెస్ట్ చేసి జైలుకి పంపారు. అయితే, ఆ ఇద్ద‌రూ త‌ర్వాత బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం వీరిపై కోర్టులో విచారణ జరగనుంది.

489 సెక్షన్ ప్రకారం… స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. కాగా, బాలికల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించినట్టు మొరాకో మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ తెలిపారు. 489 సెక్షన్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని పేర్కొన్నారు. బాలికలకు మద్దతుగా ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫొటోను ప్రచురించింది. ‘మేము భిన్న లింగ సంపర్కులం. ఎల్జీబీటీ హక్కులకు మద్దతు ఇస్తా’ మంటూ ఇద్దరు మహిళలతో ఉన్న ఫొటో పెట్టింది.

Loading...

Leave a Reply

*