సంతోషం కోసం ఎక్కువ‌మంది ఆ ప‌నే చేస్తున్నారట‌

happy-image

ప్ర‌పంచంలో చాలామంది సంతోషంగా ఉండ‌డానికి అదే చేస్తున్నారుట‌.. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు… అదా అనుకుంటారు.. ఆ ప‌ని చేస్తున్నారా అని విస్తుపోతారు… సంతోషంగా ఉండేందుకు మీరేం చేస్తున్నార‌ని ప్ర‌పంచంలోని చాలామందిని శాస్త్ర‌వేత్త‌లు అడిగారుట‌… దానికోసం ఓ స‌ర్వే నిర్వ‌హించారుట‌..

ఆ స‌ర్వేలో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు చూసి షాక్ తిన్నారు…ప్ర‌పంచంలోని 134 దేశాల‌కు చెందిన 18వేల‌మందిని ఈ ప్ర‌శ్న అడ‌గ్గా 68 శాతం మంది ఒకేలా స‌మాధానం ఇచ్చారు…. తాము సంతోషంగా ఉండేందుకు ఇత‌రుల కంటే ఎక్కువ‌గా విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు వాళ్లు చెప్పారు.. కేవ‌లం ప‌ది శాతం మాత్ర‌మే దీనికి వ్య‌తిరేకంగా స‌మాధానం ఇచ్చారుట‌.. త‌మ‌కు త‌క్కువ విశ్రాంతి ఉంటే స‌రిపోతుంద‌న్నారు…

బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ నిజాలు వెల్ల‌డ‌య్యాయి… స‌గ‌టున ఓ వ్య‌క్తి తీసుకునే విశ్రాంతి కంటే తాము ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్న‌ట్టు స‌ర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుమంది పేర్కొన్నారు…. దీనివ‌ల్లే తాము సంతోషంగా ఉన్న‌ట్టు వాళ్లు చెబుతున్నారు… వ్య‌క్తుల విశ్రాంతి అల‌వాట్లు, తీరిక లేక‌పోవ‌డంపై ఆన్‌లైన్‌లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు.. వ్య‌క్తుల సంతోషం, వారి విశ్రాంతి అల‌వాట్ల‌కు మ‌ధ్య ద‌గ్గ‌ర సంబంధం ఉన్న‌ట్టు తేలింది..

సో ప‌నిరొస్టు కంటే రెస్టు మేలు… రెస్టు ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు…. బీపీ, షుగ‌ర్ లాంటి అడ్డ‌మైన అనారోగ్యాలు కూడా రావు.. కాబ‌ట్టి టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా విశ్రాంతి తీసుకోండి అని సైంటిస్టులు స‌ల‌హా ఇస్తున్నారు. విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో మీకు ఇష్ట‌మైన వ్యాప‌కంతో గ‌డ‌పండి అని చెబుతున్నారు. సో ఎంత ఎక్కువ రిలాక్స్ అయితే అంత మంచిద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*